News July 31, 2024
అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవండి: సోనియా

దేశంలో త్వరలో జరగనున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని కాంగ్రెస్ నేతలకు సోనియా గాంధీ పిలుపునిచ్చారు. పార్టీ పార్లమెంటరీ సమావేశంలో ఆమె మాట్లాడారు. అతి నమ్మకం పనికిరాదని, కష్టపడి పనిచేస్తే లోక్‌సభ ఫలితాలే రిపీట్ అవుతాయని చెప్పారు. విభజన రాజకీయాలను ప్రజలు తిరస్కరించినా మోదీ ప్రభుత్వంలో మార్పు రాలేదన్నారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలు పార్లమెంట్ సెషన్స్‌కు మిస్ కావొద్దని సూచించారు.
Similar News
News March 8, 2025
డీలిమిటేషన్ వల్ల రాష్ట్రంలో ఎంపీ సీట్లు తగ్గవు: కిషన్ రెడ్డి

TG: డీలిమిటేషన్ వల్ల తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు తగ్గదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హిందీ భాషను ఎవరిపైనా బలవంతంగా రుద్దడం లేదన్నారు. సీఎం రేవంత్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పటికే 10 జాతీయ రహదారులను పూర్తయ్యాయని, పార్లమెంట్ సమావేశాల అనంతరం మరో 10 రహదారులను ప్రారంభిస్తామని కేంద్రమంత్రి తెలిపారు.
News March 8, 2025
రోహిత్ రిటైర్మెంట్ వార్తలు.. గిల్ ఏమన్నారంటే?

ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తారని జరుగుతున్న ప్రచారంపై శుభ్‌మన్ గిల్ స్పందించారు. ‘డ్రెస్సింగ్ రూమ్‌లో లేదా నాతో దీనిపై ఎలాంటి చర్చ జరగలేదు. మేం మ్యాచ్ గురించే ఆలోచిస్తున్నాం. రోహిత్ కూడా ఫైనల్ పైనే దృష్టి పెట్టారు’ అని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తెలిపారు. ఇప్పటివరకు తాను ఆడిన జట్లలో ఇదే బెస్ట్ బ్యాటింగ్ లైనప్ అని, చాలా డెప్త్ ఉందని పేర్కొన్నారు.
News March 8, 2025
రాజకీయాలకు అతీతంగా ఎంపీలంతా ఏకం కావాలి: భట్టి

TG: రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీల MPలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ అనంతరం మాట్లాడుతూ ‘మరోసారి అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహిస్తాం. BJP, BRS ఎంపీలు వస్తారని ఆశిస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ కలిసి కేంద్రాన్ని కలవాలి. పార్లమెంటులో రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలను లేవనెత్తాలి’ అని వ్యాఖ్యానించారు.