News July 31, 2024
పలాస: ముద్దాయికి 12 నెలలు జైలు శిక్ష

శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ పరిధి పెంటిభద్ర గ్రామానికి చెందిన సవర శాంతమూర్తి నాటు సారా అమ్ముతూ జులై 07, 2021 తేదీన ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముద్దాయికి పలాస సివిల్ కోర్టు జడ్జి యు.మాధురి 12 నెలలు సాధారణ జైలు శిక్షతో పాటు రూ.2 లక్షల జరిమానా విధించారు. ముద్దాయి జరిమానా కట్టని యెడల అదనంగా మూడు నెలలు జైలు శిక్ష పొడిగించాలని తీర్పు వెల్లడించారు.
Similar News
News January 16, 2026
ఎల్.ఎన్.పేట: పండగపూట విషాదం.. యువకుడు మృతి

ఎల్.ఎన్.పేట(M) మోదుగువలస నిర్వాసితుల కాలనీకి చెందిన సాయికుమార్(25) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. భోగి రోజు సాయికుమార్ మరో యువకుడితో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తూ స్కాట్ పేట వద్ద నడిచి వెళుతున్న వ్యక్తిని ఢీకొని కిందపడ్డారు. సాయికుమార్ మృతితో గ్రామంలో విషాద చ్ఛాయలు అలముకున్నాయి. దీనిపై కేసు నమోదు చేసినట్లు సరుబుజ్జిలి ఎస్ఐ హైమావతి తెలిపారు.
News January 16, 2026
శ్రీకాకుళం జిల్లాలో నేడు భోగి జరుపుకొనే ప్రాంతమిదే!

శ్రీకాకుళం జిల్లాలోని ఆ ప్రాంతవాసులు భోగి పండుగనే జరుపుకోరు. నేడు (కనుమ) రోజున ఈ వేడుకను నిర్వహించి.. అనంతరం సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. మెళియాపుట్టిలోని కొసమాల గ్రామంలో దేవాంగుల వీధిలోని చేనేతలే ఇలా భోగిని భిన్నంగా చేస్తారు. వృత్తి రీత్యా పనుల్లో తీరిక లేకపోవడమే ప్రధాన కారణం. ఆనాటి పూర్వీకుల ఆచారాన్నే ఇప్పటికీ ఆ వృత్తుల వారు కొనసాగిస్తున్నారు.
News January 15, 2026
సంక్రాంతి వేళ..శ్రీకాకుళంలో జరిగే జాతరలివే?

రైతుల కష్టానికి ప్రతీకగా సంక్రాంతి పండగను ఏటా ధనుర్మాసంలో జరుపుకుంటారు. మనకు అన్నీ సమకూర్చే భూమాతకు కృతజ్ఞతగా నేడు ఇళ్ల ముంగిట మహిళలు రంగవల్లులు వేస్తారు. శాస్త్రీయంగా, సైన్స్ ప్రకారం సూర్య గమనం నేటి నుంచి మారుతోంది. ఈ పండగ వేళ శ్రీకాకుళం జిల్లాలో జరిగే జాతరలివే:
✯ ఇచ్ఛాపురం: శివానందగిరిపై త్రినాథ్ స్వామి యాత్ర
✯ పలాస: డేకురుకొండ జాతర
✯ ఆమదాలవలస: సంగమయ్య కొండ జాతర


