News July 31, 2024

ఉమ్మడి జిల్లాల్లో నేటి వర్షపాత వివరాలు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బుధవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. అత్యధికంగా నాగర్ కర్నూల్ జిల్లా వెంకేశ్వర్ ‌58.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్‌నర్ జిల్లా నవాబ్ పేట 24.3 మి.మీ, గద్వాల జిల్లా ద్యాగదొడ్డిలో 17.3 మి.మీ, వనపర్తి జిల్లా గణపూర్లో 10.8 మి.మీ, నారాయణపేట జిల్లా కోస్గిలో 22.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

Similar News

News April 1, 2026

పాలమూరు: నేటి నుంచి పోలీసు యాక్ట్

image

శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీ నుండి 30వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు నెల రోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్–1861 అమలులో ఉంటుందని ఎస్పీ డి.జానకి తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రజాధనానికి నష్టం కలిగించే ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేపట్టకూడదని హెచ్చరించారు. అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు నిర్వహించరాదన్నారు.

News April 1, 2026

MBNR: NH-44.. డైవర్షన్‌లపై ఎస్పీ భద్రతా సూచనలు

image

రాజాపూర్ మండలం రాజాపూర్ టౌన్ సెంటర్ సమీపంలో జాతీయ రహదారి–44పై కొత్తగా నిర్మించనున్న ఫ్లైఓవర్ పనులకు సంబంధించి రోడ్డు డైవర్షన్‌ల ఏర్పాటుపై జిల్లా ఎస్పీ డి.జానకి కాంట్రాక్టర్ సంస్థ ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా రహదారిపై వాహన రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో డైవర్షన్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు.

News April 1, 2026

MBNR: రేపు గ్రామ, వార్డు సభలు.. ప్రభుత్వ సూచనలు

image

1) ఉ.10గంటలకు రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ ఆలపించి, సభను ప్రారంభించాలి.
2) గ్రామసభలో సర్పంచ్‌తోపాటు పాలకవర్గం, వార్డు సభలో మున్సిపల్ ఛైర్మన్‌తోపాటు పాలకవర్గం, అధికారులు, ప్రజలు హాజరుకావాలి.
3) CMసందేశాన్ని చదివి వినిపించాలి.
4) ప్రభుత్వ విజయాలు, 6గ్యారంటీలపై అవగాహన కల్పించి, పథకాలకు అర్హులను గుర్తించాలి.
5) ప్రజాసమస్యల కోసం ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేయాలి.. పరిష్కారాలపై కార్యాచరణ రూపొందించాలి.