News July 31, 2024
బాల్యవివాహాల నిరోధానికి ప్రత్యేక చర్యలు: ఐసీడీఎస్ పీడీ

బాల్యవివాహాల నిరోధానికి ఎన్ని చట్టాలు ఉన్నా అవగాహన లేకపోవడం వల్లే అవి నేటికీ కొనసాగుతున్నాయని ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి అన్నారు. బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలపై రాయదుర్గం కేజీబీవీలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. బాల్యవివాహాల నిరోధానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. ఎంపీడీఓ అల్లాబకాశ్, ఎంఈవో నాగమణి, సీడీపీఓ ప్రభావతమ్మ, ఎస్ఓ వెంకట లక్ష్మీ, డీటీ రఘు పాల్గొన్నారు.
Similar News
News November 3, 2025
తరచూ బాలల సంరక్షణా కేంద్రాలను తనిఖీ చేయాలి: జేసీ

జిల్లాలో ప్రస్తుతం ఉన్న బాలల సంరక్షణా కేంద్రాలను సంబంధిత శాఖ అధికారులు తనిఖీ చేయాలని జేసీ శివ్ నారాయణన్ శర్మ ఆదేశించారు. కలెక్టరేట్‌లో బాలల సంరక్షణ కేంద్రాల జిల్లా స్థాయి సిఫారసు కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిటీ చైర్‌పర్సన్ రాజ్యలక్ష్మి, ఐసీడీఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. బాలల సంరక్షణా కేంద్రాలలో బాలలకు సక్రమంగా పౌష్టిక ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు.
News November 3, 2025
435 ఆర్జీలు స్వీకరించిన జేసీ శివ్ నారాయణ్ శర్మ

అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 435 అర్జీలు వచ్చాయి. వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోపు, వేగంగా పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజలకు సంతృప్తికర పరిష్కారం చూపించాలని జేసీ సూచించారు.
News November 3, 2025
‘అనంతపురాన్ని కరవు జిల్లాగా ప్రకటించాలి’

అనంతపురం జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చెన్నప్ప యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం నార్పల తహశీల్దార్ కార్యాలయం ముందు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అతివృష్టి కారణంగా ఖరీఫ్ సీజన్‌లో పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారాన్ని అందించాలని ఆయన డిమాండ్ చేశారు.


