News July 31, 2024

రాజమండ్రి వాసిని అభినందించిన డిప్యూటీ సీఎం

image

అంతర్జాతీయ టైగర్స్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో పులుల ఫొటోలతో ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్‌‌కు ముఖ్య అతిథిగా మంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. రాజమహేంద్రవరం నగరానికి చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ ద్రోణంరాజు భగవాన్ దాస్ తీసిన పులుల ఫొటోలను పవన్ చూశారు. అవి చాలా అద్భుతంగా ఉన్నాయని పవన్ దాస్‌ను అభినందించారు.

Similar News

News October 26, 2025

తూ.గో: 1577 హెక్టార్లలో పంట నష్టం

image

తుపాను ప్రభావంతో శనివారం సాయంత్రానికి జిల్లా వ్యాప్తంగా 1577.38 హెక్టార్లలో పంటకు పాక్షిక నష్టం వాటిల్లినట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు తెలిపారు. దీనిలో 1374 హెక్టార్లలో వరి పంట నేలవాలగా, 183.29 హెక్టార్లు నీట మునిగాయన్నారు. 13 మండలాల పరిధిలోని 74 గ్రామాలలో 2,176 మంది రైతులకు పంట నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా గుర్తించామని ఆయన వెల్లడించారు.

News October 26, 2025

రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్లో కంట్రోల్ రూములు ఇవే.!

image

జిల్లా కంట్రోల్ రూమ్ ➢ 0883–2944455 రాజమహేంద్రవరం ఆర్డీఓ ➢0883–2442344
రాజమహేంద్రవరం అర్బన్ ➢0883–2940695 రాజమహేంద్రవరం రూరల్➢9849903860
కడియం➢6301523482 రాజానగరం➢9494546001 రంగంపేట➢ 9393931667 కోరుకొండ➢9154474851 అనపర్తి➢9441386920 బిక్కవోలు➢ 9849903913 సీతానగరం➢9177096888 గోకవరం➢9491385060 కాల్ చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు.

News October 26, 2025

అక్టోబర్ 27న పీజీఆర్ఎస్ రద్దు: కలెక్టర్

image

వాతావరణ పరిస్థితుల కారణంగా అక్టోబర్ 27న నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ (ప్రజా గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ప్రకటించారు. ప్రజలు తమ ఫిర్యాదులు సమర్పించడానికి కలెక్టరేట్‌కు నేరుగా రావాల్సిన అవసరం లేదని తెలిపారు. టోల్‌ఫ్రీ నంబర్ 1100కు కాల్ చేయవచ్చని లేదా మీ కోసమే వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ అర్జీలను నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు.