News July 31, 2024

BREAKING: పీవీ సింధు మరో విజయం

image

ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో పీవీ సింధు విజయం సాధించారు. ఎస్తోనియాకు చెందిన క్రిస్టిన్‌పై 21-5, 21-10 పాయింట్ల తేడాతో ఆమె గెలుపొందారు. దీంతో ఆమె రౌండ్-16(ప్రీ క్వార్టర్స్)కు చేరుకున్నారు.

Similar News

News March 13, 2026

రేపటి నుంచి టెన్త్ పరీక్షలు.. 5min ఆలస్యమైనా అనుమతి

image

TG: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రేపు ప్రారంభం కానున్నాయి. ఉ.9.30 గంటలకు పరీక్ష మొదలవుతుందని, ఉ.9.35 వరకూ స్టూడెంట్స్‌ను ఎగ్జామ్ హాలులోకి అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు. మొత్తం 5,28,239 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనుండగా 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. స్టూడెంట్స్ అరగంట ముందే ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకోవాలని అధికారులు సూచించారు.

News March 13, 2026

నేటి నుంచి మరోసారి థియేటర్లలో ‘ధురంధర్’

image

బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘ధురంధర్’ ఇవాళ థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. వరల్డ్ వైడ్‌గా వెయ్యికి పైగా స్క్రీన్లలో 1250కి పైగా షోలు వేయనున్నట్లు నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ ప్రకటించింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ గత ఏడాది డిసెంబర్ 5న విడుదలై రూ.1350కోట్ల వసూళ్లు రాబట్టింది. దీనికి సీక్వెల్‌గా రూపొందిన ‘ధురంధర్-2’ ఈ నెల 19న తెలుగులోనూ విడుదల కానుంది.

News March 13, 2026

మొజ్తబా ఓ కీలుబొమ్మ: నెతన్యాహు

image

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీని ఇజ్రాయెల్ PM నెతన్యాహు విమర్శించారు. ఆయన రివల్యూషనరీ గార్డ్స్ కీలుబొమ్మ అని, బయటకు కూడా రాలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌కు చెందిన టాప్ న్యూక్లియర్ సైంటిస్ట్ మరణించారని తెలిపారు. ‘ఇరాన్ ప్రజలు స్వేచ్ఛా మార్గం వైపు అడుగులు వేసే సమయం వచ్చింది. మేం వారికి అండగా ఉంటాం. కానీ మార్పు మాత్రం వారి చేతుల్లోనే ఉంది’ అని పేర్కొన్నారు.