News July 31, 2024
టీడీపీలోకి ఐదుగురు కుప్పం YCP కౌన్సిలర్లు

AP: సీఎం చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా ఐదుగురు వైసీపీ కౌన్సిలర్లు, పలువురు ఎంపీటీసీలు పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌తో కలిసి అమరావతి వెళ్లిన వీరికి చంద్రబాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న రోజుల్లో మరికొంత మంది టీడీపీలో చేరుతారని శ్రీకాంత్ తెలిపారు.
Similar News
News January 20, 2026
ఒకే రోజు రూ.22వేలు పెరిగిన వెండి ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధర ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. ఇవాళ ఒక్కరోజే <<18903989>>కేజీ<<>> వెండిపై రూ.22వేలు పెరిగి రూ.3,40,000కు చేరింది. కేవలం 10 రోజుల్లోనే వెండి ధర రూ.65వేలు పెరిగి ఇన్వెస్టర్లకు భారీ లాభాలనిచ్చింది. అటు 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.2,130 పెరిగి రూ.1,48,370, 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,950 ఎగబాకి రూ.1,36,000 పలుకుతోంది.
News January 20, 2026
షుగర్ పేషంట్లకు ‘తీపి’ వార్త!

తీపి అంటే ఇష్టం ఉన్నా ఆరోగ్య సమస్యల వల్ల దూరంగా ఉండేవారికి శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ చెప్పారు. సూక్రోస్‌లోని 92% తియ్యదనం, అందులో 1/3 వంతే క్యాలరీలు ఉన్న ‘తగటోస్’(Tagatose) అనే కొత్త రకం షుగర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇది శరీరంలో ఇన్సులిన్ స్థాయులను పెంచదు. దీనివల్ల బరువు పెరుగుతామన్న భయం లేకుండా డయాబెటిస్ ఉన్నవారూ మధుర రుచిని ఆస్వాదించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
News January 20, 2026
NIT వరంగల్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<


