News July 31, 2024
శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు డీఎస్పీల బదిలీ

శ్రీకాకుళం జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు డీఎస్పీలపై బదిలీ వేటు పడింది. శ్రీకాకుళం, టెక్కలి, కాశీబుగ్గ డీఎస్పీలు శృతి, బాల చంద్రారెడ్డి, నాగేశ్వర రెడ్డిలను ప్రభుత్వం బదిలీ చేసింది. వారందరినీ డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. వారికి పోస్టింగ్‌లు ఇవ్వలేదు.
Similar News
News March 2, 2026
SKLM: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి..ఇతను మీకు తెలుసా?

టెక్కలిలోని మహాత్మా జ్యోతీబాపూలే గురుకుల పాఠశాల ఆవరణలో సోమవారం విద్యుత్ షాక్‌తో గుర్తుతెలియని యువకుడు మృతి చెందాడు. పాఠశాల సమీపంలోని రహదారిలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను తాకడంతో పక్కనే ఉన్న కాలువపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని టెక్కలి ఎస్ఐ కె.రాము పరిశీలించారు. మృతుని వివరాలు తెలియరాలేదు. యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడా? లేదా ప్రమాదవ శాత్తు జరిగిందా? తెలియాల్సి ఉంది.
News March 2, 2026
శ్రీకాకుళం: 214కు చేరుకున్న డయేరియా కేసులు

శ్రీకాకుళం నగరంలో గత నెల 23 నుంచి ఆదివారం వరకు 214 డయేరియా కేసులు నమోదయినట్లు జిల్లా అధికారులు ప్రకటించారు. మొత్తం 116 మంది డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు 94 మంది ఉన్నారని వెల్లడించారు. ఆదివారం నలుగురు ఆసుపత్రిలో చేరారని తెలిపారు. డయేరియా అదుపులో ఉందని, అధికారుల నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని వెల్లడించారు.
News March 2, 2026
SKKM: నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక

మార్చి 2న ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అర్జీదారులు వారి అర్జీలు నేరుగాపై కార్యక్రమంలో, ఆన్‌లైన్‌లో Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. 1100 నంబర్‌కు ఫోన్ చేసి తమ అర్జీల స్థాయిని తెలుసుకోవచ్చు అన్నారు.


