News July 31, 2024
మరోసారి గోల్డ్ మ్యాన్ అవుతాడా?
పారిస్ ఒలింపిక్స్-2024లో ఇప్పటికే భారత్ రెండు కాంస్య పతకాలు సాధించగా క్రీడాభిమానులు గోల్డ్ మెడల్ కోసం ఎదురుచూస్తున్నారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆగస్టు 6న పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫయింగ్ రౌండ్ జరగనుండగా 8న ఫైనల్స్ ఉంటుంది. దీంతో చోప్రాకు ALL THE BEST చెబుతున్నారు.
Similar News
News February 2, 2025
ట్రంప్ మరో కీలక నిర్ణయం
కెనడా, మెక్సికో, చైనా దిగుమతులపై టారిఫ్ విధిస్తున్నట్లు US అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. కెనడా, మెక్సికో ఇంపోర్ట్స్‌పై 25%, చైనా దిగుమతులపై 10% పన్ను విధిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం(IEEPA) కింద ఈ చర్యలు తీసుకున్నట్లు ట్వీట్ చేశారు. డ్రగ్స్ అక్రమ రవాణా, అక్రమ వలసలను నిరోధించి దేశ ప్రజలకు మెరుగైన భద్రతను ఇవ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
News February 2, 2025
వసంత పంచమి ఎప్పుడు? క్లారిటీ
వసంతి పంచమి ఇవాళా? రేపా? అని ప్రజల్లో ఉన్న సందిగ్ధతపై పండితులు క్లారిటీ ఇచ్చారు. ‘ఇవాళ ఉ.9.45 గంటల వరకు చవితి తిథి ఉంది. ఆ తర్వాత పంచమి మొదలవుతుంది. రేపు ఉ.6.50 నిమిషాలకు సూర్యోదయం ఉంటే, పంచమి తిథి ఉ.6.52 వరకు మాత్రమే ఉంది. కేవలం 2 నిమిషాలకు పర్వదినాన్ని నిర్ణయించలేం. అందుకే 2వ తేదీనే పండుగ చేసుకోవాలి. ఇవాళ ఉ.7:09 గంటల నుంచి మ.12:35 గంటల వరకు పూజకు మంచి సమయం’ అని చెబుతున్నారు.
News February 2, 2025
వసంత పంచమి: ఏం చేయాలి?
✒ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఓ పీటకు పసుపు రాసి బియ్యం పిండితో స్వస్తిక్ గుర్తు వేయాలి. సరస్వతీ దేవి ఫొటోను ఉంచి అలంకరించాలి. పుస్తకాలు, పూలను ముందు పెట్టుకోవాలి.
✒ ఆవు నెయ్యితో 9వత్తులతో దీపాలు వెలిగించాలి.
✒ ఓ గ్లాసు నీటిని ఎడమ చేతిలో పట్టుకుని దానిమీద కుడిచేతిని ఉంచాలి. ఆ తర్వాత ‘ఓం ఐం వాన్యై స్వాహా’ అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి.
✒ ఆ నీటిని పిల్లల చేత తాగిస్తే దేవి అనుగ్రహం ఉంటుంది.