News July 31, 2024
Delhi: కారు నడిపిన వ్యక్తికి బెయిల్ నిరాకరణ

ఢిల్లీలోని రావూస్ కోచింగ్ సెంటర్లో ముగ్గురు IAS అభ్యర్థుల మృతి కేసులో SUV కారు నడిపిన బిజినెస్‌మ్యాన్ మను కతురియాకు బెయిల్ ఇచ్చేందుకు సిటీ కోర్టు నిరాకరించింది. కాగా అతివేగంగా కారు నడపడం వల్లే వరద నీటిలో అలలు ఏర్పడి కోచింగ్ సెంటర్ బేస్మెంట్‌లోకి నీరు చేరిందని పోలీసులు కతురియాను అరెస్ట్ చేశారు. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ అతడు కోర్టును ఆశ్రయించారు.
Similar News
News September 16, 2025
క్రమంగా తగ్గుతున్న నిరుద్యోగ రేటు

దేశంలో 15 ఏళ్లు, అంతకన్న ఎక్కువ వయసుండి పనిచేసే అవకాశం ఉన్న వ్యక్తుల్లో నిరుద్యోగ రేటు క్రమంగా తగ్గుతోంది. కేంద్రం విడుదల చేసిన కార్మిక సర్వే గణాంకాల ప్రకారం.. ఆగస్టులో నిరుద్యోగ రేటు 5.1%గా నమోదైంది. ఇది జులైలో 5.2 శాతంగా, మే, జూన్ నెలల్లో 5.6 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ రేటు వరసగా మూడో నెలలో కూడా తగ్గింది. మేలో 5.1% ఉన్న రేటు ఆగస్టులో 4.3 శాతానికి తగ్గింది.
News September 16, 2025
బందీలను వదిలేయండి.. హమాస్‌కు ట్రంప్ వార్నింగ్

హమాస్ నాయకులను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ‘ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కొనేందుకు బందీలను మానవ కవచాలుగా వాడేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. హమాస్ నేతలు ఏం చేస్తున్నారో వారికి అర్థమవుతోందా? ఇది మహా దారుణం. అతి తక్కువ మంది అలాంటివి చూసుంటారు. అలా జరగకుండా ఆపండి. లేదంటే అన్నీ ఒప్పందాలు రద్దవుతాయి. బందీలను వెంటనే విడుదల చేయండి’ అని వార్నింగ్ ఇచ్చారు.
News September 16, 2025
మద్యంమత్తులో లారీ డ్రైవర్ బీభత్సం

MPలోని ఇండోర్‌లో ఓ లారీ డ్రైవర్ మద్యం తాగి వాహనంతో బీభత్సం సృష్టించాడు. వాహనాలనే కాకుండా రోడ్డు పక్కనే నడుస్తున్న ప్రజలను కూడా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా పలువురికి గాయాలయ్యాయి. బైకులను ఢీకొట్టి వాటిని రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లాడు. ఓ బైకును లాక్కెళ్లడంతో దాని ట్యాంక్ పేలి లారీ మొత్తం తగలబడిపోయింది. డ్రైవర్ ఫుల్‌గా తాగేసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదైంది.