News July 31, 2024
చిత్తూరు జిల్లాలో పలువురు DSPలు బదిలీ

చిత్తూరు జిల్లాలోని పలువురు DSPలు బదిలీ అయ్యారు. రాజారావు(TPT)ను విజయవాడ ACPగా, జి శ్రీనివాసరావు(TPT)ను నెల్లూరు రూరల్ SDPOగా, ఉమమహేశ్వరరెడ్డి(SKHT), శరత్ రాజ్ కుమార్ (చంద్రగిరి), ప్రసాద్ రెడ్డి(MPL), షను షెక్(TPT)ను పోలీసు Hqtrకు, రవిమనోహారాచారి(TPT)ని CID DSPగా, శ్రావణ్ కుమార్(CTR)ను ఏలూరుటౌన్‌కు, B.మురళి(TPT)ను పులివెందులకు, శ్రీనివాసాచారి(తిరుమల) కర్నూల్ దిశ DSPగా బదిలీ అయ్యారు.
Similar News
News January 4, 2026
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నేటి టమాటా ధరలు

టమాటా ధరలు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం ధరలు ఇలా ఉన్నాయి.
☞ పుంగనూరులో మొదటి రకం “10 కిలోల” బాక్స్ ధర గరిష్ఠంగా రూ.367, కనిష్ఠ ధర రూ.234
☞ పలమనేరులో గరిష్ఠ ధర రూ. 450, కనిష్ఠ ధర రూ.370
☞వీకోట గరిష్ఠ ధర రూ.420, కనిష్ఠ ధర రూ. 360
☞ కలికిరి గరిష్ఠ ధర రూ.400, కనిష్ఠ ధర రూ. 370
☞ ములకలచెరువులో గరిష్ఠ ధర రూ.450, కనిష్ఠ ధర రూ. 350 వరకు పలుకుతోంది.
News January 4, 2026
చిత్తూరు: ఉపాధిపై రేపు గ్రామసభలు

జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఈనెల 5వ తేదీన గ్రామసభలు నిర్వహించనున్నట్లు డీపీవో సుధాకర రావు తెలిపారు. నిరుపేదలకు ఉపాధి హామీ కల్పించేందుకు ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ఇటీవల కేంద్రం వికసిత్ భారత్ వీబీజీ రామ్ జీగా మార్పు చేసినట్లు తెలిపారు. పథకం మార్పులపై గ్రామసభలు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు చేసిందని చెప్పారు. పథకంపై సభలలో అవగాహన కల్పిస్తామన్నారు.
News January 4, 2026
చిత్తూరు జిల్లాలో నేటి చికెన్ ధరలు

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.178 నుంచి రూ.187, మాంసం రూ.258 నుంచి 285 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.294 నుంచి రూ.310 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు12 కోడిగుడ్ల ధర రూ. 96 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.


