News July 31, 2024
తల్లి నగలపై బ్రిటన్ రాజకుటుంబంలో చిచ్చు

దివంగత బ్రిటన్ ప్రిన్సెస్ డయానా నగల విషయంలో ఆమె వారసులు విలియం, హ్యారీ మధ్య చిచ్చు రగిలిందని రచయిత రాబ్ జాబ్సన్ ‘కేథరిన్, ది ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్’ పుస్తకంలో తెలిపారు. ‘నటి మేఘన్ మార్కెల్‌ను హ్యారీ పెళ్లి చేసుకోవడం రాజకుటుంబానికి అస్సలు ఇష్టం లేదు. అందుకే తమ తల్లి నగల్ని మేఘన్‌కు ఇవ్వనని విలియం తేల్చిచెప్పారు. ఆ విభేదాల కారణంగానే హ్యారీ దంపతులు రాచరికాన్ని వదిలేసుకున్నారు’ అని వెల్లడించారు.
Similar News
News March 17, 2026
డీఎంకే బెదిరించిందని ఆరోపణలు.. స్పందించిన రజినీకాంత్

రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ సమయంలో డీఎంకే ఆయన్ను బెదిరించిందని టీవీకే నేత ఆధవ్ అర్జున చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో సంచలనం రేపాయి. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ రజినీ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఆధవ్ అర్జున వ్యాఖ్యల్లో నిజం లేదు. ఆయన వ్యాఖ్యలను ఖండించి నాకు మద్దతుగా నిలిచిన నేతలకు, అభిమానులకు ధన్యవాదాలు. కాలం మాట్లాడకపోవచ్చు. కానీ వేచి ఉండి సమాధానం ఇస్తుంది’ అని పేర్కొన్నారు.
News March 17, 2026
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం కీలక సూచన!

LPG వినియోగదారుల్లో eKYCపై నెలకొన్న గందరగోళంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఇప్పటివరకు eKYC పూర్తి చేయనివారు మాత్రమే చేసుకోవాలని సూచించింది. ఈ ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసుంటే మళ్లీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ‘ఉజ్వల లబ్ధిదారులు మాత్రం ఏడాదికి ఒకసారి చేయాలి. అది కూడా 8, 9వ రీఫిల్స్‌పై సబ్సిడీ పొందడానికి ఇది అవసరం. దీనివల్ల గ్యాస్ సరఫరాకు ఎలాంటి అంతరాయం ఉండదు’ అని పేర్కొంది.
News March 17, 2026
కాసేపట్లో వర్షం

TG: రాష్ట్రంలో అకాల వర్షాలు కొనసాగుతున్నాయి. ఇవాళ సాయంత్రం 4 గంటల లోపు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 41-61కి.మీ మధ్య గాలులు వీయడంతో పాటు ఉరుములతో కూడిన వర్షాలు పడొచ్చని పేర్కొంది.


