News July 31, 2024

మోసానికి ప్రతిరూపం సబిత: మీడియా చిట్‌చాట్‌లో రేవంత్

image

TG: సబితా ఇంద్రారెడ్డి తనను కాంగ్రెస్‌లోకి రమ్మని, తర్వాత ఆమె బీఆర్ఎస్‌లోకి మారారని మీడియా చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ అన్నారు. ఆమె మోసానికి ప్రతిరూపం అని వ్యాఖ్యానించారు. ‘నేను సభలో సబిత పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. ఆమె ఆవేదనలో అర్థం లేదు. ఆమె మీద ఏ మాత్రం అభిమానం ఉన్నా కేసీఆర్ సభకు రావాలి’ అని పేర్కొన్నారు. సభలో BRS సభ్యులకు ఇవ్వాల్సిన సమయం ఇచ్చామని తెలిపారు.

Similar News

News April 4, 2026

ప్రభాస్ ‘ఫౌజీ’ ఫొటోలు లీక్.. మేకర్స్ వార్నింగ్

image

హను రాఘవపూడి డైరెక్షన్‌లో ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ షూటింగ్‌కు సంబంధించి లీకైన కొన్ని ఫొటోలు వైరలవుతున్నాయి. దీనిపై మేకర్స్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి కంటెంట్‌పై రిపోర్ట్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆ ఫొటోలను షేర్ చేయొద్దని సూచించారు. ఇలాంటి లీకుల వల్ల సినిమా నిర్మాణంపై ప్రభావం పడుతుందన్నారు. సిల్వర్ స్క్రీన్‌పై మూవీని చూస్తే అద్భుతంగా ఉంటుందని చెప్పారు.

News April 4, 2026

రాఘవ్ చడ్ఢా బీజేపీలో చేరబోతున్నారా?

image

ఆమ్ ఆద్మీ పార్టీలో విభేదాలతో MP రాఘవ్ చడ్ఢా BJPలో చేరుతారంటూ ప్రచారం జరుగుతోంది. గతంలో BJP, మోదీని విమర్శిస్తూ చేసిన ట్వీట్లను ఆయన తొలగించారని కొందరు పోస్టులు చేస్తున్నారు. ‘Xలో రాఘవ్ టైమ్‌లైన్‌లో BJP/మోదీ పదాలతో వెతికాను. అక్కడ విమర్శనాత్మక పోస్టులేవీ లేవు. అంటే అతను పాత ట్వీట్లను తొలగించారు. మోదీని పొగుడుతున్న 2 పోస్టులు మాత్రం అలానే ఉన్నాయి’ అని ఆప్ ఢిల్లీ చీఫ్ సౌరభ్ భరద్వాజ్ ట్వీట్ చేశారు.

News April 4, 2026

IPL: 154.2KM వేగంతో బంతి.. అశోక్ శర్మ సెన్సేషన్

image

GT యంగ్ బౌలర్ అశోక్ శర్మ సంచలనం సృష్టించారు. ఇవాళ RRతో మ్యాచ్‌లో 16వ ఓవర్ చివరి బంతిని ఏకంగా 154.2KM వేగంతో వేశారు. ఈ సీజన్‌లో ఇదే ఫాస్టెస్ట్ బాల్. ఈ స్పీడ్ స్టార్ 148-150KM వేగంతో బౌలింగ్ చేసి ఆకట్టుకున్నారు. జైపూర్‌లోని వ్యవసాయ కుటుంబంలో ఇతను జన్మించారు. తొలుత రాజస్థాన్‌కు నెట్ బౌలర్‌గా ఉన్నారు. 2022లో KKR, 2025లో RR టీమ్‌లో ఉన్నారు. 2026లో GT రూ.90 లక్షలకు కొనుగోలు చేసింది.