News July 31, 2024
మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి మరోసారి చుక్కెదురు

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి మరోసారి చుక్కెదురయింది. బుధవారం గుంటూరు జిల్లా కోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించింది. పాల్వాయి గేటులో టీడీపీ ఏజెంట్‌పై దాడి, కారంపూడి సీఐపై దాడి అభియోగాలతో పిన్నెల్లి నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో జిల్లా కోర్టులో బెయిల్ కోసం పిన్నెల్లి పిటిషన్ దాఖలు చేయగా, రెండు కేసుల్లోనూ జడ్జి బెయిల్ నిరాకరించారు. గతంలో సెషన్స్ కోర్టు బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే.
Similar News
News September 17, 2025
వెలగపూడి: బీసీ రక్షణ చట్టంపై మంత్రి అనగాని సమీక్ష

బీసీల రక్షణ కోసం చట్టం రూపొందించడంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ బుధవారం వెలగపూడి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం సమగ్ర బీసీ రక్షణ చట్టం తీసుకురావడానికి కసరత్తు జరుగుతోందని ఆయన తెలిపారు. ఈ చట్టం అమలులో ఎదురయ్యే సవాళ్లు, వాటి పరిష్కారాలపై సహచర మంత్రులతో ఆయన చర్చించారు. బీసీల హక్కుల రక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.
News September 17, 2025
రేపు వెంకటపాలెంలో NTR విగ్రహానికి నివాళులర్పించనున్న సీఎం

రాష్ట్ర సచివాలయంలో గురువారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించనున్నారు. ఉదయం 8 గంటలకు పూలమాలలు వేసి ఆయన నివాళులు అర్పిస్తారని తాడికొండ నియోజకవర్గ టీడీపీ కార్యాలయం తెలిపింది. అనంతరం అక్కడి నుంచి అసెంబ్లీకి బయలుదేరతారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు.
News September 17, 2025
తాడేపల్లి: తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

ఈనెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో జరగనున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబుని టీటీడీ ఆహ్వానించింది. బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. పండితులు సీఎంను ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.