News July 31, 2024
పిన్నెల్లికి మరోసారి షాక్.. బెయిల్ నిరాకరణ
AP: పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరోసారి చుక్కెదురైంది. గుంటూరు జిల్లా కోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించింది. గతంలో సెషన్స్ కోర్టు బెయిల్ ఇవ్వకపోవడంతో ఆయన జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సమయంలో కారంపూడి సీఐ, టీడీపీ ఏజెంట్‌పై దాడి చేశారనే అభియోగాలతో పిన్నెల్లిపై కేసు నమోదైంది. ప్రస్తుతం ఆయన నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
Similar News
News February 2, 2025
వసంత పంచమి ఎప్పుడు? క్లారిటీ
వసంతి పంచమి ఇవాళా? రేపా? అని ప్రజల్లో ఉన్న సందిగ్ధతపై పండితులు క్లారిటీ ఇచ్చారు. ‘ఇవాళ ఉ.9.45 గంటల వరకు చవితి తిథి ఉంది. ఆ తర్వాత పంచమి మొదలవుతుంది. రేపు ఉ.6.50 నిమిషాలకు సూర్యోదయం ఉంటే, పంచమి తిథి ఉ.6.52 వరకు మాత్రమే ఉంది. కేవలం 2 నిమిషాలకు పర్వదినాన్ని నిర్ణయించలేం. అందుకే 2వ తేదీనే పండుగ చేసుకోవాలి. ఇవాళ ఉ.7:09 గంటల నుంచి మ.12:35 గంటల వరకు పూజకు మంచి సమయం’ అని చెబుతున్నారు.
News February 2, 2025
వసంత పంచమి: ఏం చేయాలి?
✒ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఓ పీటకు పసుపు రాసి బియ్యం పిండితో స్వస్తిక్ గుర్తు వేయాలి. సరస్వతీ దేవి ఫొటోను ఉంచి అలంకరించాలి. పుస్తకాలు, పూలను ముందు పెట్టుకోవాలి.
✒ ఆవు నెయ్యితో 9వత్తులతో దీపాలు వెలిగించాలి.
✒ ఓ గ్లాసు నీటిని ఎడమ చేతిలో పట్టుకుని దానిమీద కుడిచేతిని ఉంచాలి. ఆ తర్వాత ‘ఓం ఐం వాన్యై స్వాహా’ అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి.
✒ ఆ నీటిని పిల్లల చేత తాగిస్తే దేవి అనుగ్రహం ఉంటుంది.
News February 2, 2025
హోమ్ లోన్ తీసుకునే వారికి వడ్డీ సబ్సిడీ
2025-26లో హోం లోన్ ద్వారా ఇల్లు కొనుగోలు చేసే వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 10 లక్షల మందికి వడ్డీ సబ్సిడీ స్కీమ్ కింద ప్రయోజనం చేకూర్చనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం ₹3,500Cr కేటాయించింది. ఎలా? ఏ విధంగా లబ్ధి కలిగిస్తుందనేది వెల్లడించలేదు. PMAY(అర్బన్)కు ₹19,794Cr, PMAY(గ్రామీణ్)కు ₹54,832Cr ఇచ్చింది. 2029 మార్చికల్లా 2 కోట్ల అదనపు గృహాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది.