News July 31, 2024
నంబర్ వన్ టెస్ట్ బ్యాటర్‌గా జో రూట్

ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాకింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ నంబర్ వన్ టెస్ట్ బ్యాటర్‌గా నిలిచారు. 872 పాయింట్లతో రూట్ అగ్రస్థానంలో ఉండగా న్యూజిలాండ్ బ్యాటర్ విలియమ్సన్(859) రెండో స్థానంలో ఉన్నారు. 3, 4, 5 స్థానాల్లో బాబర్ ఆజం(PAK), మిచెల్(NZ), స్మిత్(AUS) ఉన్నారు. ఇక 6వ స్థానంలో రోహిత్ శర్మ, 7లో హ్యారీ బ్రూక్(ENG), 8లో జైస్వాల్, 9లో కరుణరత్నే(SL), 10వ స్థానంలో కోహ్లీ ఉన్నారు.
Similar News
News March 8, 2025
అక్షరాస్యుల కేరళకు ‘ఎడ్యుకేషన్ క్రైసిస్’

దేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన కేరళ ఇప్పుడు విద్యా సంక్షోభం ఎదుర్కొంటోంది. విదేశాలకు వెళ్లే విద్యార్థులు కరోనా అప్పటి నుంచి రెట్టింపైంది. గతంలో గల్ఫ్ క్రంటీస్‌కు వెళ్తే వాళ్ల నుంచి డబ్బులైనా వచ్చేవి. ఇప్పుడు శాశ్వత నివాసం కల్పించే దేశాలకు వలస వెళ్తున్నారు. లెఫ్టిస్టుల పాలన, విద్యాసంస్థల్లో లోపాలు, PVT వర్సిటీలు, యూనియన్లు, పాలిటిక్స్, కంపెనీలు, ఉద్యోగాలు లేకపోవడమే ఇందుకు కారణాలని సమాచారం.
News March 8, 2025
IIT బాబా మార్కులు చూస్తే ఆశ్చర్యపోతారు!

మహాకుంభమేళాతో వెలుగులోకి వచ్చిన ఐఐటీ బాబా (అభయ్ సింగ్) మార్క్స్ షీట్ వైరల్ అవుతోంది. ఇతడికి 10వ తరగతి బోర్డు పరీక్షల్లో 93%, 12వ తరగతిలో 92.4% మార్కులు వచ్చాయి. 2008లో ఐఐటీ జేఈఈలో ఆల్ ఇండియా 731వ ర్యాంక్ సాధించి, ప్రతిష్ఠాత్మక ఐఐటీ బాంబేలో సీటు దక్కించుకున్నారు. 2008-12 వరకు బీటెక్ పూర్తిచేసి, కెనడాలో ఏడాదికి రూ.36 లక్షల జీతానికి జాబ్ చేశారు. ఆ తర్వాత ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుని బాబాగా మారారు.
News March 8, 2025
ఎక్కువ మంది పిల్లలను కనమంటున్న బాబు.. మీ కామెంట్?

ఎక్కువ మంది పిల్లలను కనండి అని విస్తృత ప్రచారం చేస్తున్న CM చంద్రబాబు అందుకోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళా ఉద్యోగులు ఎంత మంది పిల్లలను కన్నా అన్ని కాన్పులకూ ప్రసూతి సెలవులు ఇస్తామన్నారు. దీంతో వారికి 6 నెలల చొప్పున జీతంతో కూడిన సెలవులు రానున్నాయి. గతంలో ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అనర్హులు. దాన్నీ తొలగించి చట్టంలో మార్పులు చేశారు. దీనిపై మీ కామెంట్?