News July 31, 2024
మంగళగిరి ఎయిమ్స్‌లో సౌకర్యాలు మెరుగుపరచాలి: కలెక్టర్

మంగళగిరి ఎయిమ్స్‌లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. ఎయిమ్స్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలపై ఆమె బుధవారం సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రహదారులు, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. మోడల్ హాస్పిటల్‌గా తీర్చిదిద్దేందుకు పనులన్నీ వెంటనే పూర్తి చేసి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.
Similar News
News March 13, 2026
గుంటూరు: ఈ నంబర్‌తో పోలీస్ సేవలు..!

గుంటూరు జిల్లా ప్రజలు మన మిత్ర – వాట్సాప్ గవర్నెన్స్ సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. 95523 00009 నంబర్‌కు వాట్సాప్‌లో హాయ్ అని సందేశం పంపితే FIR కాపీ, కేసు స్థితి, ఈ-చలానా వివరాలు వంటి పోలీస్ సేవలు మొబైల్‌లోనే పొందవచ్చన్నారు. సైబర్ క్రైమ్ ఫిర్యాదులకు 1930, అత్యవసర పోలీస్ సహాయానికి 112 కు కాల్ చేయాలని సూచించారు.
News March 13, 2026
GMCలో అవినీతికి పాల్పడ్డ సెక్రటరీ సస్పెండ్

అవినీతికి పాల్పడిన గుంటూరు నగరపాలక సంస్థ సెక్రటరీ ఎ.పవన్ కుమార్ పై గురువారం సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు చేయాలని అధికారులను నగర కమిషనర్ కె. మయూర్ అశోక్‌ను కోరారు. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల సొమ్ము (ఆస్తి పన్ను, LRS) సొంతానికి వాడుకోవడం, తక్కువ మొత్తానికి నకిలీ రశీదులు సృష్టించి ప్రభుత్వం, ప్రజలను మోసం చేయడంపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
News March 13, 2026
కలెక్టర్ల సదస్సులో గుంటూరు కలెక్టర్, ఎస్పీ

అమరావతిలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్సులో CM చంద్రబాబు జిల్లాల కలెక్టర్, SPలకు కీలక సూచనలు చేశారు. ప్రజల ప్రాణాల కంటే ముఖ్యమైనది ఏదీ లేదని పేర్కొంటూ రోడ్డు ప్రమాదాలు తగ్గించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బ్లాక్ స్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మహిళలపై నేరాల విషయంలో జీరో టాలరెన్స్ పాటించాలని స్పష్టం చేశారు.


