News July 31, 2024

ఏపీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదం

image

AP: ఏపీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌‌ ఆర్డినెన్స్‌కు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. రూ.1,29,972 కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. నవంబర్ 30 వరకు ఈ బడ్జెట్ అమలులో ఉంటుంది. ఇందులో అన్నక్యాంటీన్ల నిర్మాణం, రహదారుల మరమ్మతులు సహా పలు అత్యవసర విభాగాలకు ప్రభుత్వం కేటాయింపులు చేసింది. కాగా గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ నేటితో ముగిసింది.

Similar News

News April 1, 2026

IPL: శ్రేయస్ అయ్యర్‌కు ఫైన్

image

IPL-19 సీజన్‌లో తొలిసారి PBKS కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌‌కు BCCI ఫైన్ విధించింది. నిన్న GTతో జరిగిన మ్యాచులో స్లో ఓవర్ రేట్ ల రూ.12లక్షల ఫైన్ వేసింది. PBKS 19వ ఓవర్ చేరుకునేటప్పటికే అంపైర్ స్లో ఓవర్ వార్నింగ్ ఇవ్వగా ఆపై <<19529168>>అర్ష్‌దీప్<<>> మరింత ఆలస్యం చేశారు.

News April 1, 2026

అమరావతి బిల్లుపై చర్చకు YCP

image

పార్లమెంటులో ఇవాళ ప్రవేశపెట్టే రాజధాని అమరావతి బిల్లుపై చర్చలో వైసీపీ పాల్గొననుంది. ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది. మరోవైపు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను టీడీపీ ఎంపీలు కలిశారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత చర్చకు ఉంటుందని ఎంపీలతో స్పీకర్ చెప్పారు.

News April 1, 2026

రాష్ట్రంలో 14,553 పోలీస్ ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్

image

తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. కొత్తగా సంస్థాన్ నారాయణపూర్, ఆమన్‌గల్‌లో స్పెషల్ పోలీస్ బెటాలియన్లు ఏర్పాటు కానున్నాయి. వీటికి అవసరమైన సిబ్బందితో పాటు వివిధ విభాగాల్లో మొత్తం 14,553 కానిస్టేబుళ్లు, ఎస్సైల కోసం పోలీస్ శాఖ రిక్రూట్‌మెంట్‌ చేపట్టనుంది. ఇందుకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం కనిపిస్తోంది.