News July 31, 2024
త్వరలో కళాకారులతో సమావేశమవుతా: మంత్రి దుర్గేష్

త్వరలో కళాకారుల సంఘాలు, కళాకారులతో సమావేశమవుతానని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. బుధవారం తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక నాటక పరిషత్ సమాఖ్య అధ్యక్షుడు వెంకట రామారావు, బీవీఆర్ కళా కేంద్రం సభ్యులు ఆంజనేయ స్వామి ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కళాకారుల సమస్యలను మంత్రికి విన్నవించారు.
Similar News
News January 12, 2026
ప.గో: అర్జీదారులకు గమనిక.. గ్రీవెన్స్ వేదిక మార్పు

ప్రతి సోమవారం గొల్లలకోడేరు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ వేదికను తాత్కాలికంగా మార్చినట్లు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. అర్జీల స్వీకరణ కార్యక్రమం గొల్లలకోడేరు కార్యాలయానికి బదులుగా భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో జరగనుంది. గొల్లలకోడేరు కార్యాలయానికి రావాల్సిన అర్జీదారులు నేరుగా వన్‌టౌన్ స్టేషన్‌కు వచ్చి తమ వినతులు అందజేయాలని ఎస్పీ ఒక ప్రకటనలో కోరారు.
News January 12, 2026
ప.గో జిల్లాలో సోమవారం యథావిధిగా పీజీఆర్ఎస్

భీమవరం కలెక్టరేట్, జిల్లాలోని అన్ని ప్రభుత్వ మండల కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. నేరుగా రాలేని వారు 1100 కాల్ సెంటర్ లేదా వెబ్‌సైట్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.