News August 1, 2024
BREAKING: మాజీ క్రికెటర్ అన్షుమన్ కన్నుమూత

కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్(71) కన్నుమూశారు. ఈయన 1974-87 మధ్య భారత్ తరఫున 40 టెస్టులు, 15 వన్డేలు ఆడారు. రెండు సార్లు టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా పనిచేశారు. ఈయన చికిత్స కోసం బీసీసీఐ రూ.కోటి సాయం చేసింది. ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. అన్షుమన్ మృతిపై బీసీసీఐ కార్యదర్శి జై షా ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.
Similar News
News November 12, 2025
కొన్నాళ్లు వేరుకాపురం ఉండటం మంచిదే..

పెళ్లైన తర్వాత కొన్నాళ్లు వేరుకాపురం ఉండటం మంచిదే అంటున్నారు నిపుణులు. దీనివల్ల బంధం దృఢమవ్వడంతో పాటు బాధ్యతలు తెలుస్తాయంటున్నారు. అలాగే ప్రస్తుతం దంపతులిద్దరూ ఉద్యోగం చేస్తుండటంతో కలిసి గడిపే సమయం తగ్గిపోయింది. అదే విడిగా ఉంటే కాస్త సమయమైనా దొరుకుతుందంటున్నారు. అత్తమామలతో అనుబంధం దృఢమయ్యే దాకా విడిగా ఉంటూనే సందర్భం వచ్చినప్పుడు వారితో సమయం గడపాలని సూచిస్తున్నారు.
News November 12, 2025
రబీలో సాగుకు అనువైన వేరుశనగ రకాలు

నీటి వసతిని బట్టి రబీలో వేరుశనగను నవంబర్ నుంచి DEC-15 వరకు విత్తుకోవచ్చు. కోస్తా జిల్లాల్లో రైతులు ఎక్కువగా విశిష్ట TCGS 1694 రకాన్ని సాగు చేస్తున్నారు. దీని పంట కాలం 100-105 రోజులు. దిగుబడి హెక్టారుకు 25 క్వింటాళ్లు. దీనిలో నూనెశాతం 49%. ఇదే కాకుండా కదిరి-6, కదిరి-7, ధీరజ్, ధరణి, గ్రీష్మ, నిత్యహరిత మంచి దిగుబడిస్తాయి. వేరుశనగను ప్రతిసారి ఒకే రకం కాకుండా.. మార్చి నాటితే మంచి దిగుబడి పొందవచ్చు.
News November 12, 2025
MSTCలో 37 ఉద్యోగాలు

మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ (MSTC) 37మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి BE/ బీటెక్, డిగ్రీ/PG, CA/CMA, MBA, MCA ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ నెల 15 నుంచి 30వరకు అప్లై చేసుకోవచ్చు. నెలకు జీతం రూ.50వేల నుంచి రూ.1,60,000 చెల్లిస్తారు. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://mstcindia.co.in/


