News August 1, 2024

బీజేపీపై కేంద్ర మంత్రి కుమారస్వామి ఫైర్

image

కర్ణాటకలో BJP, JDS మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ముడా, వాల్మీకి స్కామ్‌లపై కాంగ్రెస్ సర్కార్‌కు వ్యతిరేకంగా BJP చేపట్టిన పాదయాత్రపై నీలినీడలు అలుముకున్నాయి. దేవెగౌడ కుటుంబాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించిన హసన్ మాజీ MLA ప్రీతంతో మేం ఎలా వేదిక పంచుకుంటాం? అని కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రశ్నించారు. BJP తీరు బాధపెట్టిందన్నారు. ప్రజ్వల్ సెక్స్ టేప్‌లను వైరల్ చేయడంలో ప్రీతం పాత్ర ఉందనే ఆరోపణలున్నాయి.

Similar News

News March 5, 2026

హార్ముజ్ జలసంధిలో 23వేల మంది ఇండియన్స్!

image

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం నేపథ్యంలో హార్ముజ్ జలసంధిలో రాకపోకలను ఇరాన్ అడ్డుకుంటోంది. దీంతో గల్ఫ్ రీజియన్‌లో 36 ఇండియన్ కార్గో షిప్స్ నిలిచిపోయాయి. వీటిలో LPG, LNG క్యారియర్స్, క్రూడ్ ఆయిల్ ట్యాంకర్స్, కంటెయినర్ షిప్స్ ఉన్నాయి. ఈ క్రమంలో వాటిలో 23 వేల మంది ఇండియన్ సైలర్స్ చిక్కుకుపోయినట్లు సమాచారం. ఒమన్ ప్రాంతంలో ఆయిల్ ట్యాంకర్‌పై జరిగిన దాడిలో ఇద్దరు భారతీయులు మరణించారు.

News March 5, 2026

ఒకరు వద్దు.. ఇద్దరు ఓకే.. ముగ్గురు ముద్దు: చంద్రబాబు

image

AP: ఇక నుంచి ‘ఒకరు వద్దు.. ఇద్దరు ఓకే.. ముగ్గురు ముద్దు’ అని మాట్లాడాలని సీఎం CBN పిలుపునిచ్చారు. ‘ఫ్యామిలీ ప్లానింగ్ ఇప్పుడు అసంబద్ధం. జనాభా లేక ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయి. దక్షిణ భారతదేశంలో జనాభా తక్కువగా ఉంది. జనాభా తగ్గడం వల్ల రాజకీయంగా కూడా ఇబ్బందులు వస్తాయి. నేను రాజకీయ ప్రయోజనాల గురించి మాట్లాడటం లేదు. ఏ దేశంలో ఎక్కువ జనాభా ఉంటే ఆ దేశం ధనిక దేశం అవుతుంది’ అని అసెంబ్లీలో చెప్పారు.

News March 5, 2026

గ్యాస్, ఆయిల్ కొరత లేదు: ప్రభుత్వ వర్గాలు

image

ఇంధన భద్రత విషయంలో ఇండియా కంఫర్టబుల్ పొజిషన్‌లోనే ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘అవసరమైనంత మేర నిల్వలున్నాయి. రోజూ స్టాక్ నింపుతున్నాం. LPG/LNG కొరత లేదు. ప్రపంచంలో ముడి చమురుకు షార్టేజ్ లేదు. క్రూడ్, గ్యాస్ కొనుగోలు కోసం ఉత్పత్తిదారులు, వ్యాపారులు, IEA, OPECతో చర్చిస్తున్నాం. గ్యాస్ సరఫరాకు ఆస్ట్రేలియా, కెనడా ముందుకొచ్చాయి. UAE, USతో ఒప్పందం చేసుకున్నాం’ అని వెల్లడించాయి.