News August 1, 2024
విశాఖ ఎమ్మెల్సీ సీటు కోసం పోటాపోటీ

విశాఖలో స్థానిక సంస్థల MLC స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. గతంలో స్థానిక సంస్థల నుంచి MLCగా ఎన్నికైన వంశీకృష్ణ శ్రీనివాస్ పార్టీ మారడంతో స్పీకర్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ఆ స్థానానికి ఇప్పుడు పోటీ జరుగుతుంది. కాగా కూటమి నుంచి సీతంరాజు సుధాకర్,గండి బాబ్జి, YCP నుంచి గుడివాడ అమర్నాథ్, కోలా గురువులు, తిప్పల నాగిరెడ్డి సీటు కోసం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 12, 2025
విశాఖలో నేటి నుంచి డ్రోన్ ఎగురవేయుట నిషేదం

విశాఖలో భాగస్వామ్య సదస్సులు జరగనున్న నేపథ్యంలో నగరవాసులకు సీపీ శంఖబ్రత బాగ్చి మంగళవారం పలు సూచనలు చేశారు. ఈనెల 12వ తేదీ నుుంచి 16వ తేదీ వరకు ఏయూ నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో డ్రోన్ ఎగురవేయట నిషేధమని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని విశాఖ ప్రజలు గమనించాలని సూచించారు. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా డ్రోన్ ఎగురవేస్తే చట్టప్రకారమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
News November 11, 2025
విశాఖ: అబార్షన్ కిట్ అమ్ముతున్న మెడికల్ షాప్‌పై కేసు

డాక్టర్ మందులు చీటీ లేకుండా గర్భాన్ని తొలగించేందుకు వాడే మందులను అమ్ముతున్న మెడికల్ షాప్‌పై విశాఖ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది దాడులు చేశారు. సీపీ సూచనలతో గోపాలపట్నంలోని దర్విన్ ఫార్మసీపై మంగళవారం దాడులు చేయగా ఆరు కిట్లు స్వాధీనం చేసుకున్నట్లు సిబ్బంది తెలిపారు. దుకాణంపై కేసు నమోదు చేసి మందులను డ్రగ్ కంట్రోలర్ అప్పగిస్తామని వెల్లడించారు.
News November 11, 2025
పెదగంట్యాడలో ఎంఎస్ఎంఈ పార్క్‌కు శంకస్థాపన

రాష్ట్రంలో ప్రతి ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి అన్నారు. మంగళవారం పెదగంట్యాడలో ఎం.ఎస్.ఎం.ఈ పార్క్‌కి మంత్రులు డీఎస్ బీవీ స్వామి, వాసంశెట్టి సుభాష్, ఎంపీ శ్రీ భరత్ శంఖుస్థాపన చేశారు. ఒకే రోజు రాష్ట్రంలో 27 ఎం.ఎస్.ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేయడం చారిత్రాత్మక ఘట్టం అన్నారు.


