News August 1, 2024

తెలంగాణకు రైల్వే లైన్లు మంజూరు చేయండి: రఘునందన్

image

తెలంగాణకు కొత్త రైల్వేలైన్లు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మెదక్ ఎంపీ రఘునందన్ రావు కోరారు. లోక్‌సభలో రైల్వే బడ్జెట్‌పై ఆయన మాట్లాడారు. ఆర్మూర్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్‌కు, కరీంనగర్ నుంచి హసన్‌పర్తి వరకు కొత్త లైన్లు ప్రారంభించాలని కోరారు. HYD MMTS విస్తరణపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర వాటా రాబట్టి ముందుకు తీసుకెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు.

Similar News

News March 12, 2026

పారిశ్రామిక హబ్‌గా ఏపీ: సీఎం చంద్రబాబు

image

AP: వైసీపీ ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఉన్న కంపెనీలు కూడా పారిపోయే పరిస్థితి చూశామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్‌గా మార్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ ‘అభివృద్ధి కోసం ఏ చిన్న ప్రయత్నం చేసినా దీర్ఘకాలంలో వాటి ఫలితాలను చూస్తాం’ అని పేర్కొన్నారు.

News March 12, 2026

ఫరూఖ్‌ను 20 ఏళ్లుగా చంపాలనుకుంటున్నా: నిందితుడు

image

J&K మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లాపై <<19359185>>హత్యాయత్నం<<>> చేసిన కమల్ సింగ్ పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు. ‘ఫరూఖ్‌ను చంపాలని 20 ఏళ్లుగా అనుకుంటున్నా. ఇది నా పర్సనల్ అజెండా. ఇవాళ నాకు అవకాశం వచ్చింది. కాల్పులు జరిపింది నా తుపాకీతోనే. అదృష్టంకొద్దీ బతికిపోయారు’ అని పేర్కొన్నాడు. మాజీ సీఎంను చంపే ప్రయత్నం ఎందుకు చేశాడనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News March 12, 2026

కోడిగుడ్డు ధరలు తగ్గాయ్..

image

తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్ల ధరలు భారీగా తగ్గుతున్నాయి. మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం కారణంగా ఎగుమతులు భారీగా తగ్గిపోయి నిల్వలు పెరగడమే దీనికి ప్రధాన కారణమని వ్యాపారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో కొన్ని వారాల క్రితం ఒక్కో గుడ్డు రూ.7-8 ఉండగా ఇప్పుడు హోల్ సేల్ మార్కెట్లో రూ.3.5-4కే అమ్ముతున్నారు. రిటైల్‌లో మాత్రం రూ.6 వరకు తీసుకుంటున్నారు. మరి మీ దగ్గర గుడ్డు రేటు ఎంత ఉందో కామెంట్ చేయండి.