News August 1, 2024
సీఎం ప్రకటనతో జిల్లా వాలంటీర్లలో ఆనందం

జిల్లాలో 6385 మంది వాలంటీర్ల ఆశలు చిగురించాయి. దీనికి ప్రధాన కారణం తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు వాలంటీర్లను కొనసాగిస్తామని ప్రకటించడమే. ఎన్నికల సమయంలో జిల్లా వ్యాప్తంగా రాజీనామా చేయకుండా 6385 మంది వాలంటీర్లు ఉన్నారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, అందుకు గల విధివిధానాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు ప్రభుత్వం సైతం ప్రకటించింది. అయితే జిల్లాలో రాజీనామా చేసిన వాలంటీర్‌ల పరిస్థితి తేలాల్సి ఉంది.
Similar News
News March 25, 2026
చీమకుర్తి: పెళ్లికి ఒప్పుకోలేదని యువతి ఆత్మహత్య

చీమకుర్తి మండలంలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. గోనేపల్లివారిపాలేనికి చెందిన అంజలి(21) గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. అతను పెళ్లికి ఒప్పుకోలేదు. ఈక్రమంలో అతని పొలం వద్దే ఆమె ఉరేసుకుని చనిపోయింది. యువతి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
News March 25, 2026
ప్రకాశం జిల్లా MLAలకు టెన్షన్.. టెన్షన్!

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన కొందరు MLAల్లో టెన్షన్ రేపుతోంది. ప్రస్తుతం SNపాడు, వై.పాలెం, కొండపి SC నియోజకవర్గాలు. పునర్విభజనలో జనరల్ స్థానాలను SC, STలతో పాటు మహిళలకు రిజర్వ్ చేస్తే కొత్త సీటు కోసం ఇప్పటి MLAలకు వెతుకులాట తప్పదు. వీటితో పాటు నియోజకవర్గాలు ముక్కలై, కొత్త మండలాలు కలిసే అవకాశం ఉంటుంది. ఆ మండలాలపై పట్టు సాధించాలంటే ప్రస్తుత MLAలకు ఓ కఠిన పరీక్షే.
News March 25, 2026
ప్రకాశం: ఇద్దరికి జైలుశిక్ష

ప్రకాశం జిల్లా టంగుటూరులో శ్రీనివాస థియేటర్ దగ్గర ఓ బైక్, వల్లూరు ఫేస్ ఇంజినీరింగ్ కాలేజీలో పార్కింగ్ చేసిన మరో బైక్ దొంగతనానికి గురైంది. 2025లో కేసు నమోద చేశారు. ఎస్ఐ నాగమల్లేశ్వరరావు దర్యాప్తు చేపట్టారు. నిందితులు నరసరావుపేట మండలం గురవాయపాలేనికి చెందిన బండారు నవీన్, తాళ్లూరి గాబ్రియల్‌గా గుర్తించారు. నేరం రుజువు కావడంతో వారికి రూ.10వేల జరిమానా, 5నెలలు జైలుశిక్ష పడింది.


