News August 1, 2024

సూర్యాపేట హైవే వద్ద వంతెన మంజూరు

image

ఖమ్మం-సూర్యాపేట హైవే ఎంట్రీ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం మంజూరైనట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు టేకుమట్ల వద్ద సూర్యపేట వైపు కొద్ది దూరం వెళ్లి తిరిగి రావాల్సి వస్తుందని పేర్కొన్నారు. దీంతో సంభవిస్తున్న ప్రమాదాలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ ద్వారా తెలియజేయగా బ్లాక్ స్పాట్‌గా గుర్తించి ఫ్లైఓవర్ మంజూరుకు అనుమతి ఇచ్చారని పేర్కొన్నారు.

Similar News

News March 3, 2026

వెలుగుమట్ల పార్కును సందర్శించిన డీఎఫ్ఓ

image

ఖమ్మం వెలుగుమట్ల అర్బన్ పార్కును జిల్లా అటవీ శాఖాధికారి (డీఎఫ్ఓ) సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ మంగళవారం సందర్శించి అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. వేసవిలో అడవులను కార్చిచ్చు నుంచి రక్షించుకోవడంపై సిబ్బంది నిర్వహించిన మాక్ డ్రిల్ పరిశీలించారు. బ్లోయర్లు, ఇతర పరికరాలతో మంటలను ఎలా అదుపు చేయాలో సిబ్బందికి పలు సూచనలు చేశారు. అడవుల రక్షణకు వేగవంతమైన ప్రతిస్పందన చర్యలు అవసరమని ఆయన పేర్కొన్నారు.

News March 3, 2026

కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ఖమ్మం కలెక్టర్

image

హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ సదస్సులో ఖమ్మం కలెక్టర్ అనుదీప్ పాల్గొన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని, గ్రామసభల్లో లబ్ధిదారుల వివరాలు వెల్లడించాలని సీఎం సూచించారు. ఆసుపత్రులను మెడికల్ కాలేజీలతో అనుసంధానించాలని, మధ్యాహ్న భోజన బిల్లులను సకాలంలో చెల్లించాలని ఆదేశించారు. జిల్లాలో అభివృద్ధి పనుల వేగవంతంపై చర్చించారు.

News March 3, 2026

ఖమ్మం: ఇంటింటికీ నల్లా.. పంచాయతీలకే తాగునీటి బాధ్యత

image

ఖమ్మం జిల్లాలో తాగునీటి కష్టాలకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వ ‘జల్‌ జీవన్‌ మిషన్‌’ పథకం సిద్ధమైంది. ఈ పథకంలో భాగంగా గ్రామాల్లోని ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు, పైపులైన్ల నిర్వహణ బాధ్యతలను ఇకపై నేరుగా గ్రామ పంచాయతీలకే అప్పగించనున్నారు. సర్పంచి అధ్యక్షతన ఉండే ‘గ్రామ నీటి, పారిశుద్ధ్య కమిటీల’ ద్వారా ప్రతి ఇంటికీ 100 శాతం నల్లా కనెక్షన్లు ఇచ్చి, నిరంతర సరఫరాను పర్యవేక్షిస్తారు.