News August 1, 2024

సీఎంపై తప్పుడు పోస్ట్.. కేసు నమోదు

image

TG: CM రేవంత్ రెడ్డిపై తప్పుడు పోస్ట్ పెట్టినందుకు HYD సైబర్ క్రైమ్ పోలీసులు BRS సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌పై కేసు నమోదు చేశారు. జులై 29న అర్ధరాత్రి వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు CM హాజరుకాలేదంటూ క్రిశాంక్ పోస్ట్ పెట్టడంపై కాంగ్రెస్ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై ఐటీ చట్టం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. తాజా కేసుతో క్రిశాంక్‌పై నమోదైన కేసుల సంఖ్య ఏడుకు చేరింది.

Similar News

News February 2, 2025

T20 WC: 82కే సౌతాఫ్రికా ఆలౌట్

image

అండర్-19 ఉమెన్స్ టీ20 WC ఫైనల్లో భారత బౌలర్లు విజృంభించారు. దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌటైంది. తెలుగమ్మాయి త్రిష 3 వికెట్లతో సత్తా చాటారు. ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మ, పరుణిక రెండేసి వికెట్లతో ఆకట్టుకున్నారు. భారత విజయలక్ష్యం 83.

News February 2, 2025

తిరుపతి తొక్కిసలాట ఘటన.. విచారణకు హాజరైన ఈవో, ఎస్పీ

image

తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ కొనసాగుతోంది. తిరుపతి కలెక్టరేట్‌లో జస్టిస్ సత్యనారాయణమూర్తి ఎదుట టీటీడీ ఈవో శ్యామలరావు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు విచారణకు హాజరయ్యారు. గత నెల వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోగా, 40 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే.

News February 2, 2025

నాని ‘ప్యారడైజ్’కు మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్.. ఎవరంటే

image

నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రానున్న ‘ది ప్యారడైజ్’కు మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచందర్‌ ఖరారయ్యారు. మూవీ టీమ్ ఈ విషయాన్ని అనౌన్స్ చేసింది. ‘ఇప్పుడు అధికారికంగా అనిరుధ్‌ను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నాం. ఇక తగలబెట్టేద్దాం’ అని ట్వీట్ చేసింది. నాని, అనిరుధ్ కాంబోలో జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలు రాగా ‘ప్యారడైజ్’ మూడోది కానుంది. అటు నానికి శ్రీకాంత్ ఓదెలతో ‘దసరా’ తర్వాత ఇది రెండో సినిమా.