News August 1, 2024
భూ రిజిస్ట్రేషన్ విలువల పెంపుపై ప్రభుత్వం దృష్టి
AP: భూ రిజిస్ట్రేషన్ విలువలను పెంచడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విజయవాడ, గుంటూరు, విశాఖ వంటి పట్టణాలు, నగరాల్లో ప్రస్తుతం ఉన్న విలువ కంటే 5 నుంచి 10 శాతం పెరగొచ్చని సమాచారం. అలాగే కొన్నిచోట్ల రిజిస్ట్రేషన్ విలువ ఎక్కువ ఉంటే బహిరంగ మార్కెట్ విలువలు తక్కువ ఉన్నాయి. ఈ హెచ్చు తగ్గులపైనా అధికారులు దృష్టిసారించారు. ఈ శాఖపై రేపు CM చంద్రబాబు నిర్వహించే సమీక్షలో విలువ పెంపుపై క్లారిటీ రానుంది.
Similar News
News February 2, 2025
ట్యాక్స్ రిలీఫ్ వల్ల వినియోగం, పొదుపు పెరుగుతాయి: నిర్మల
మిడిల్ క్లాస్ ప్రజలకు మద్దతివ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నెలకు రూ.లక్ష సంపాదించే వాళ్లకు ట్యాక్స్ రిలీఫ్ దక్కాలని, తాము నిజాయితీగా పన్ను చెల్లించేవారిని గుర్తిస్తామని తెలిపారు. ఆదాయపు పన్ను పరిమితి తగ్గించడం వల్ల వారి చేతుల్లో ఎక్కువ డబ్బులు ఉంటాయని, తద్వారా వినియోగం, పొదుపు, పెట్టుబడులు పెరుగుతాయని NDTV ఇంటర్వ్యూలో వివరించారు.
News February 2, 2025
RAILWAY: అన్నీ ఒకే యాప్లో..
ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు ఒకే దగ్గర కల్పించేందుకు రైల్వేశాఖ ‘SWA RAIL’ అనే సూపర్ యాప్ తెస్తోంది. తాజాగా కొంతమందికి EARLY ACCESS ఇచ్చింది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. ట్రైన్ టికెట్ బుకింగ్, పార్శిల్ బుకింగ్, కోచ్ పొజిషన్, రన్నింగ్ స్టేటస్, ఫుడ్ ఆర్డర్ల కోసం వేర్వేరు యాప్స్ వాడే అవసరం లేకుండా అన్నీ ఇందులోనే ఉంటాయి.
News February 2, 2025
T20 WC: 82కే సౌతాఫ్రికా ఆలౌట్
అండర్-19 ఉమెన్స్ టీ20 WC ఫైనల్లో భారత బౌలర్లు విజృంభించారు. దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌటైంది. తెలుగమ్మాయి త్రిష 3 వికెట్లతో సత్తా చాటారు. ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మ, పరుణిక రెండేసి వికెట్లతో ఆకట్టుకున్నారు. భారత విజయలక్ష్యం 83.