News August 1, 2024
విజయవాడ: మహిళపై దాడి.. ఐదుగురిపై కేసు నమోదు

టైలరింగ్ చేసుకునే ఓ మహిళపై దాడి చేసిన ఐదుగురిపై నున్న పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాలు.. జులై 29 రాత్రి దుకాణంలో ఉండగా ఖాసీం అనే యువకుడు మద్యం తాగి వచ్చి దుర్భాషలాడాడు. కుటుంబ సభ్యులు వచ్చి ఆమెతో గొడవ పడ్డారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళుతుండగా ఉషాదుర్గ సోదరుడిపై రాయితో దాడి చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఖాసిం, నాగుర, మబి, షకీలా, నాగురా తల్లిపై కేసు నమోదు చేశారు.
Similar News
News January 23, 2026
కృష్ణా: ఈ శాఖలో టెన్త్ అర్హతతో ఉద్యోగాలు

నిరుద్యోగ యువతకు భారతీయ పోస్టల్ శాఖ శుభవార్త తెలిపింది. దేశ వ్యాప్తంగా గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి 28,740 ఉద్యోగాలతో భారీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌కు 1,215 పోస్టులు కేటాయించగా, మచిలీపట్నం డివిజన్ పరిధిలో 27 ఉద్యోగాలు ఉన్నాయి. రాత పరీక్ష లేకుండా, 10వ తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక జరగనుంది. దరఖాస్తులు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు స్వీకరించనున్నారు.
News January 22, 2026
EVM గోడౌన్ భద్రతలో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

కలెక్టరేట్ ప్రాంగణంలోని EVM గోడౌన్ వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా గురువారం కలెక్టరేట్ ప్రాంగణంలోని EVM గోడౌన్‌ను ఆయన తనిఖీ చేశారు. గోడౌన్ వద్ద ఉన్న భద్రతా చర్యలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భద్రతా చర్యలు విషయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.
News January 22, 2026
కృష్ణా: 23న జిల్లాలో ‘నా ఇండియా నా ఓటు’

కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 23వ తేదీన జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలలో ‘నా ఇండియా నా ఓటు’ అనే నినాదంతో ఓటర్ల ప్రతిజ్ఞ చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఈ ప్రతిజ్ఞ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది అందరూ తప్పనిసరిగా పాల్గొనాలని ఆయన సూచించారు.


