News August 1, 2024
ADB: ఇన్‌స్టాగ్రామ్‌లో తప్పుడు ప్రచారం.. కేసు నమోదు

ఆదిలాబాద్‌లోని ఓ హోటల్ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న గుర్తుతెలియని వ్యక్తులపై 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 29న నలుగురు వ్యక్తులు హోటల్లో భోజనానికి వెళ్లి సిబ్బందితో గొడవపడి బయటకు వచ్చేశారు. అనంతరం హోటల్ ఫొటో తీసుకొని అందులో భోజనం సరిగా ఉండదని, రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా కామెంట్స్ రాసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ విషయమై హోటల్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News March 14, 2026
ఆదిలాబాద్‌లో పది పరీక్షకు 23 మంది గైర్హాజరు

ఆదిలాబాద్ జిల్లాలో పదవ తరగతి పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా ముగిసాయి. జిల్లా వ్యాప్తంగా 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా శనివారం నిర్వహించిన పరీక్షకు 10887 మంది విద్యార్థులకు గాను 10864 విద్యార్థులు హాజరై 23 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 33 పరీక్ష కేంద్రాలను ఆయా జిల్లా అధికారులు విస్తృతంగా సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు.
News March 14, 2026
భూభారతి పనులను వేగవంతం చేయాలి: ADB కలెక్టర్

ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి పనులను వేగవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి పథకాల అమలుపై శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.