News August 1, 2024
నేడు క్యాబినెట్ భేటీ.. రేషన్ కార్డుల జారీపై చర్చ

TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ సాయంత్రం సమావేశం కానుంది. కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రధానంగా చర్చించి క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటుచేయనుంది. అలాగే నూతన మెడికల్ కాలేజీలకు స్థలాల కేటాయింపు, మూసీ అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు నిధుల అంశంపై చర్చించనుంది. రిజర్వాయర్లు, చెరువుల్లో పూడికతీత, బాక్సర్ నిఖత్ జరీన్, క్రికెటర్ సిరాజ్‌కు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంపై నిర్ణయం తీసుకోనుంది.
Similar News
News November 3, 2025
శభాష్.. షెఫాలీ!

వైల్డ్ కార్డ్ ఎంట్రీతో తన వైల్డ్ పర్ఫామెన్స్‌తో టీమిండియా కప్పు కొట్టడంలో కీలకపాత్ర పోషించిన షెఫాలీ వర్మ క్రికెట్ జర్నీ అంత సాఫీగా సాగలేదు. క్రికెట్ అకాడమీలో చేరేటప్పుడు అమ్మాయి అని తనను ఎవరూ చేర్చుకోలేదు. దీంతో జుట్టు కత్తిరించుకొని అబ్బాయిలా మారి వాళ్లతో ఆడారు. అందుకోసం రోజూ 16KM సైకిల్‌పై వెళ్లేవారు. తన ప్రతిభతో జట్టులో చోటు సంపాదించి, జట్టుకు తొలి WC ట్రోఫీ అందించిన ఆమె జర్నీ స్ఫూర్తిదాయకం.
News November 3, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 03, సోమవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.01 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.15 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.08 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.44 గంటలకు
✒ ఇష: రాత్రి 6.58 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 3, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.


