News August 1, 2024
నిర్మల్ : రుణమాఫీ కాకా… నిరాశలో రైతన్నలు..!

ఓ వైపు రుణమాఫీ సంబరాలు జరుగుతుండగా మరోవైపు మాఫీ జాబితాలో తమ పేర్లు లేవంటూ వేలాది మంది ఆవేదనకు గురవుతున్నారు. నిర్మల్ జిల్లాలో సుమారుగా 1.80 లక్షల మం ది రైతులున్నారు. లక్షలోపు రుణాలున్న 30,109 మంది రైతులకు మొదటి విడతలో, రూ.1.50 లక్ష లలోపు రుణాలున్న 19,058 మంది రైతులకు రెండో విడత జాబితాలో పేర్లు వచ్చాయి. జిల్లాలో 4.40 లక్షల ఎకరాల పంటభూములున్నాయి. వీరు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు.
Similar News
News March 4, 2026
ఆదిలాబాద్: ఇంటర్ పరీక్షలు.. 376 మంది గైర్హాజరు

ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 8,529 మంది విద్యార్థులకు గాను 8,153 మంది హాజరయ్యారని డీఐఈఓ జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. జనరల్ విభాగంలో 282 మంది, ఒకేషనల్ విభాగంలో 94 మంది కలిపి మొత్తం 376 మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
News March 4, 2026
ఉట్నూర్: జీసీసీకి నిధులు మంజూరయ్యేనా..?

ఉమ్మడి ADBలోని 41 కొత్త డీఆర్ డిపోల నిర్మాణానికి రూ.8.20 కోట్లు, 21 డీఆర్ డిపోల మరమ్మతులకు రూ.కోటి, డివిజన్ ఆఫీస్‌ల మరమ్మతులకు రూ.10 లక్షలు, కాగజ్‌నగర్, జన్నారం ఆసిఫాబాద్‌లో ఆఫీస్‌ల నిర్మాణానికి రూ.1.50 కోట్లు, అటవీ ఉత్పత్తుల సేకరణకు రూ.2.10 కోట్లు నిధులు అవసరం కానున్నాయి. ఈమేరకు రాష్ట్ర గీక్ ఛైర్మన్ తిరుపతికి ఇటీవల కలిసి జీసీసీ డీఎం సందీప్ కుమార్ విన్నవించారు. మరి నిధులు మంజూరయ్యేనా చూడాలి.
News March 3, 2026
హోలీ వేడుకల్లో జాగ్రత్తలు తప్పనిసరి: ఎస్పీ అఖిల్ మహాజన్

హోలీని శాంతియుతంగా, స్వీయ భద్రతా జాగ్రత్తలతో జరుపుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజలు వీలైనంత వరకు సహజసిద్ధమైన రంగులనే వాడాలని కోరారు. యువత, చిన్నారులు ఉత్సాహంలో వాగులు, నదులు, లోతట్టు ప్రాంతాల్లో ఈతకు వెళ్లి ప్రమాదాల బారిన పడొద్దని హెచ్చరించారు. ఈత రాని వారు నీటిలోకి వెళ్లవద్దని, తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని విజ్ఞప్తి చేశారు.


