News August 1, 2024
హైకోర్టు పీపీగా .. సిక్కోలు వాసికి చోటు …!

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కృష్ణచంద్రాపురం గ్రామానికి చెందిన మెండ లక్ష్మీనారాయణ రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా అవకాశం చేజిక్కించుకున్నారు. బీసీ వర్గానికి చెందిన ఆయన రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ)గా నియమితులయ్యారు. ఆయనను పీపీగా నియమిస్తూ న్యాయశాఖ ఇన్‌ఛార్జ్ కార్యదర్శి సునీత బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జిల్లాలోని పలువురు న్యాయవాది లక్ష్మీనారాయణను ప్రశంసిస్తున్నారు.
Similar News
News March 26, 2026
పొందూరులో 32 ఏళ్ల యువకుడు సూసైడ్

పొందూరు మండలం కనిమెట్ట గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన శ్రావణ్ కుమార్(32) గురువారం ఉరివేసుకొని మృతి చెందినట్లు ఎస్సై సత్యనారాయణ పేర్కొన్నారు. కుటుంబ కలహాలు నేపథ్యంలో ఇంటిలో ఎవరూ లేని సమయంలో శ్రవణ్ ఉరివేసుకున్నట్లు ఆయన తెలిపారు. శ్రావణ్ మరణంతో తల్లిదండ్రులు, భార్య కన్నీటి పర్యంతమయ్యరు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 26, 2026
ఎచ్చెర్లలో యాక్సిడెంట్..తల్లీ, కుమారుడు మృతి

ఎచ్చెర్ల మండలం అక్కివలస జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు..విశాఖకు చెందిన నరేంద్ర కుమార్ తల్లితో కలిసి అరసవల్లి సూర్యనారాయణ స్వామి దర్శనానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఎచ్చెర్ల హైవేపై వెనక నుంచి లారీని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
News March 26, 2026
శ్రీకాకుళం: 22ఏ జాబితా భూములు సవరించరా?

జిల్లాలో భూ సమస్యలో ప్రధానమైంది 22A సమస్య. రైతుల భూములు ప్రభుత్వ భూములుగా నమోదు కావడంతో అమ్మకాలు, కొనుగోలు నిలిచిపోతున్నాయి. నిషేధిత జాబితా సమస్య పరిష్కరించాలని జిల్లా అధికారులకు ఎక్కువగా రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. రీ సర్వేల్లో తప్పులు వల్ల జిరాయితీ భూములు ప్రభుత్వ భూములుగా నమోదు చేశారని రైతుల అంటున్నారు. వారసత్వ భూములు, కొనుగోలు భూములు ప్రభుత్వ భూములుగా చూపిస్తున్నారని అంటున్నారు.


