News August 1, 2024
ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న ఇరాన్: అమెరికా

ఇరాన్ ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని అమెరికా విదేశాంగశాఖ డిప్యూటీ ప్రతినిధి వేదాంత్ పటేల్ ఆరోపించారు. ఆ దేశం నుంచి ఎదురయ్యే ముప్పును అడ్డుకుంటామని చెప్పారు. ‘తమ సొంత ప్రజలనే అణచివేసిన చరిత్ర ఇరాన్‌ది. ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చడంతో టెహ్రాన్‌ది కీలకపాత్ర’ అని ఆయన పేర్కొన్నారు. కాగా తమ అతిథి ఇస్మాయిల్ హనియేను చంపినందుకు ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Similar News
News March 17, 2026
బెంగాల్‌లో బిగ్గెస్ట్ ఫైట్.. మమత vs సువేందు

పశ్చిమ బెంగాల్‌లో మరోసారి హైవోల్టేజ్ ఫైట్ జరగనుంది. సీఎం మమతా బెనర్జీ, బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారి ఒకే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. వీరిద్దరూ సౌత్ కోల్‌కతాలోని భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. APR 23 నుంచి 29 మధ్య రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమతను ఓడించిన సువేందు ఈసారి ఆమె సొంత నియోజకవర్గంలోనే పోటీకి దిగడం గమనార్హం.
News March 17, 2026
ప్రపంచంలో క్రూడాయిల్ ఎక్కువగా వాడే దేశాలివే..

2024 లెక్కల ప్రకారం క్రూడాయిల్ వినియోగంలో అమెరికా, చైనా టాప్‌లో ఉన్నాయి.
1. అమెరికా: 19 మిలియన్ బ్యారెళ్లు (ఒక రోజులో)
2. చైనా: 16.4 మి. బ్యారెళ్లు
3. భారత్: 5.6 మి. బ్యారెళ్లు
4. సౌదీ అరేబియా: 4 మి. బ్యారెళ్లు
5. రష్యా: 3.8 మి. బ్యారెళ్లు
6. జపాన్: 3.2 మి. బ్యారెళ్లు
7. సౌత్ కొరియా: 2.9 మి. బ్యారెళ్లు
>మిలియన్ అంటే 10 లక్షలు. బ్యారెల్ అంటే 159 లీటర్లు
News March 17, 2026
Stock Market: వరుసగా రెండో రోజూ లాభాలు

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాల్లో క్లోజ్ అయ్యాయి. గ్యాస్, చమురు ట్యాంకర్లు భారత్‌కు చేరుతుండడం సెంటిమెంట్‌ను పెంచింది. కీలక రంగాల షేర్లు అట్రాక్టివ్ ప్రైస్‌కు తగ్గడంతో కొనుగోళ్ల కళ కనిపించింది. సెన్సెక్స్ 567 పాయింట్లు పెరిగి 76,070 వద్ద క్లోజైంది. నిఫ్టీ 172 పాయింట్లు ఎగబాకి 23,581 వద్ద స్థిరపడింది. ఎటర్నల్, టాటా స్టీల్, M&M, BEL షేర్లు లాభపడగా.. ఇన్ఫీ, ITC, TCS నష్టపోయాయి.


