News August 1, 2024

నిమిషానికి కాల్ రేట్లు 3 పైసలే: కేంద్ర మంత్రి

image

ప్రపంచంలోనే అతి తక్కువ ఫోన్ కాల్ రేట్లు భారత్‌లోనే ఉన్నాయని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. గతంలో నిమిషానికి కాల్ ఖర్చు 53 పైసలుగా ఉండగా ప్రస్తుతం 3 పైసలకు చేరినట్లు తెలిపారు. దాదాపు 93% తగ్గినట్లు లోక్‌సభలో చెప్పారు. దేశంలో ప్రస్తుతం 117 కోట్ల మొబైల్ కనెక్షన్లు, 93 కోట్ల ఇంటర్నెట్ కనెక్షన్లు ఉన్నాయన్నారు. ఏప్రిల్ 2024 నాటికి దేశంలోని 95.15% గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం ఉందన్నారు.

Similar News

News March 5, 2026

AC కొంటున్నారా? ఇవి గుర్తుంచుకోండి!

image

గతంలో ధనవంతులకే పరిమితమైన ACలు ఇప్పుడు దిగువ మధ్యతరగతి ఇళ్లకూ వచ్చేస్తున్నాయి. ACలు కొనేముందు కింది పాయింట్లను పరిశీలించండి.
*100-120 స్క్వేర్ ఫీట్ల గది ఉంటే 1 టన్ ఏసీ సరిపోతుంది.
*5 స్టార్ రేటింగ్ ఉన్న ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ కొనేందుకు ప్రయత్నించండి. దీనివల్ల 30-40% విద్యుత్ ఆదా అవుతుంది.
*కూలింగ్ కెపాసిటీ ఔట్‌పుట్ ఎక్కువగా ఉండాలి.
*10 ఏళ్ల కంప్రెషర్ వారంటీ ఉండేలా చూసుకోండి.
Share It

News March 5, 2026

న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ను ఆపేందుకు రెడీ.. కాకపోతే: ఇరాన్

image

US, ఇజ్రాయెల్‌తో యుద్ధం తీవ్రంగా జరుగుతున్న సమయంలో ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి మజీద్ తఖ్త్ రావంచి కీలక ప్రకటన చేశారు. అణ్వాయుధ ప్రోగ్రామ్‌ను ఆపేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. కానీ తమకు సంతృప్తికర ప్రత్యామ్నాయ ఆఫర్ ఇవ్వాలని కండీషన్ పెట్టారు. అయితే ఇది తాజా ఆఫర్ కాదని, అమెరికాతో జరిపిన గత చర్చలకు సంబంధించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ IRNA చెప్పుకొచ్చింది.

News March 5, 2026

సంతానోత్పత్తికోసం ‘మాతృత్వ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’: CBN

image

AP: సంతాన లేమితో బాధపడుతున్న వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని CM చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. PPP మోడల్‌లో ‘మాతృత్వ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’లు ఏర్పాటు చేసి సబ్సిడీపై IVF సేవలు అందించాలని యోచిస్తున్నామన్నారు. ‘ఒకప్పుడు 3.0గా ఉన్న ఫెర్టిలిటీ రేట్ 1.5కి తగ్గిపోయింది. దీనివల్ల పనిచేసే వారి సంఖ్య తగ్గి ఆర్థిక వృద్ధి పడిపోతుంది. టీనేజ్ గర్భధారణలు తగ్గించే చర్యలు చేపడుతున్నాం’ అని CBN పేర్కొన్నారు.