News August 1, 2024
రేషన్ కార్డు లేని వారికి ALERT

TG: రుణమాఫీ కాలేదంటూ రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. పాస్‌బుక్, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డులో పేర్లు తేడాగా ఉండటంతో చాలామందికి మాఫీ కావడం లేదు. రేషన్ కార్డు లేని వారికి పూర్తిగా కావడం లేదు. అలాంటి వారికి గ్రామపంచాయతీలో కమిటీల ద్వారా త్వరలోనే కుటుంబ నిర్ధారణ చేశాక రుణమాఫీ వర్తిస్తుందని అధికారులు చెప్పారు. ఇందుకోసం కొంత సమయం పడుతుందని, రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు.
Similar News
News November 7, 2025
ప్రకాశం: భారీగా పెరిగిన పొగాకు ధర.. కానీ!

ప్రకాశం జిల్లాలో పొగాకు ధరలు భారీగా పెరిగాయి. మార్చి 10న వేలం ప్రారంభమప్పుడు గరిష్ఠ ధర KG రూ.280గా ఉంది. తర్వాత క్రమంగా పెరిగింది. తుఫాన్ ముందు రూ.315 ఉండగా వారం లోపే ప్రస్తుతం రూ.362కి చేరింది. వేలం ముగింపు వేళ ధర పెంచి.. వచ్చే సీజన్‌లో రైతులు ఎక్కువ సాగు చేసేలా కంపెనీలు కుట్రలు చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. హైగ్రేడ్ ధరలు పెరిగినప్పటికీ లోగ్రేడ్ కేజీ రూ.150 నుంచి రూ.50కి పడిపోవడం గమనార్హం.
News November 7, 2025
రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ రివ్యూ&రేటింగ్

టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో చిక్కుకుని దాన్నుంచి బయటపడలేక నలిగిపోయిన ఓ అమ్మాయి కథే ‘ది గర్ల్ ఫ్రెండ్’. పైకి నవ్వుతున్నట్లు కనిపించినా లోపల అంతులేని బాధను అనుభవించే పాత్రలో రష్మిక అదరగొట్టారు. డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కథను చెప్పిన విధానం బాగుంది. సాంగ్స్, BGM ప్రధాన బలం. ఎమోషన్లకు పెద్దపీట వేయడంతో స్టోరీ స్లోగా సాగినట్లు అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో అనవసర సీన్లు, కథ ఊహించేలా ఉండటం మైనస్.
RATING: 2.75/5
News November 7, 2025
ఇతిహాసాలు క్విజ్ – 59

1. అర్జునుడి శంఖం పేరేంటి?
2. రుక్మిణి సోదరుడు ఎవరు?
3. అట్ల తద్ది పండుగ ఏ మాసంలో వస్తుంది?
4. సుమంత్రుడు ఎవరి రథసారథి?
5. తిరుపతిలో తలనీలాలు సమర్పించే స్థలాన్ని ఏమంటారు?
☞ సరైన సమాధానాలను సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>


