News August 1, 2024
ఎస్సీ, ఎస్టీల వర్గీకరణ అవసరమే: సుప్రీంకోర్టు తీర్పు

SC, ST రిజర్వేషన్ల వర్గీకరణపై MRPS దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం SC, ST వర్గీకరణ అవసరమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 నిష్పత్తితో తీర్పు వెలువరించింది. దీని వల్ల SC, STల్లోని వెనుకబడిన కులాలకు లబ్ధి జరుగుతుందని అభిప్రాయపడింది.
Similar News
News March 17, 2026
రేపటి నుంచే దివ్యాంగులకు ఉచిత ప్రయాణం!

AP: RTC బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం రేపటి నుంచి అందుబాటులోకి రానుంది. ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. 40 శాతం, ఆపైన వైకల్యం ఉన్న దివ్యాంగులు సిటీ ఆర్డినరీ, మెట్రో, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఫ్రీగా వెళ్లొచ్చు. బస్సు ఎక్కేటప్పుడు PHC పాస్/వికలాంగుల కార్డు చూపించి జీరో టికెట్ తీసుకోవాలని RTC సూచించింది.
News March 17, 2026
KKRకు గాయాల ‘దెబ్బ’

IPL ప్రారంభానికి ముందు KKRను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే ఇంజూరీతో హర్షిత్ రాణా <<19394540>>నడవలేని <<>>స్థితిలో ఉన్నారు. T20 WC సందర్భంగా గాయపడ్డ శ్రీలంక పేసర్ పతిరణ ఆడటం కూడా అనుమానంగా మారింది. KKR అతడిని రూ.18Crకు కొనుగోలు చేసింది. అయితే ఏదో ఒక దశలో పతిరణ అందుబాటులోకి వస్తాడని భావిస్తోంది. పతిరణ, రాణాకు రీప్లేస్‌మెంట్ తీసుకోవద్దని నిర్ణయించింది. ముస్తాఫిజుర్ ప్లేస్‌లో <<19375126>>ముజరబానిని<<>> తీసుకుంది.
News March 17, 2026
ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో రాయితీ

మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఆస్తి పన్ను బకాయిలపై AP ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెలాఖరులోగా చెల్లిస్తే వడ్డీలో 50 శాతం రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. అటు తెలంగాణలోని హైదరాబాద్ పరిధిలో ఆస్తి పన్ను బకాయిలపై 90 శాతం వడ్డీ మినహాయింపు ఇవ్వనున్నట్లు GHMC ఇటీవల ప్రకటించింది. మార్చి 31 వరకు అవకాశం ఉంటుందని తెలిపింది.


