News August 1, 2024

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అంటే ఏంటి?

image

ఎస్సీ, ఎస్టీ కులాల్లో అంతర్గతంగా రిజర్వేషన్లు అందరికీ సమానంగా అందడం లేదనే వాదనతో ఈ వర్గీకరణ డిమాండ్ మొదలైంది. ఉదా.2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి AP ఎస్సీ జనాభా 1,38,78,078. అందులో మాదిగలు 67లక్షలు. మాలలు 55లక్షలు. అంటే మాలల కంటే మాదిగలు 12లక్షలు ఎక్కువ. అయితే జనాభాలో ఎక్కువున్న తమకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు అండం లేదనేది వాదన. అందుకే SCల్లోనూ A, B, C, D ఉప కులాలుగా <<13751609>>వర్గీకరించాలంటున్నారు<<>>.

Similar News

News March 22, 2026

ట్రంప్ అల్టిమేటమ్.. వెనక్కి తగ్గిన ఇరాన్

image

అమెరికా అధ్యక్షుడు <<19445494>>ట్రంప్<<>> 48 గంటల అల్టిమేటమ్ నేపథ్యంలో ఇరాన్ హార్ముజ్‌ విషయంలో వెనక్కి తగ్గింది. జలసంధి మీదుగా షిప్పులు వెళ్లేందుకు అంగీకరించింది. అయితే శత్రు దేశాల నౌకలను మాత్రం అనుమతించేది లేదని కండీషన్ పెట్టింది. ఆయిల్ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ఇది ఊరటనిచ్చే విషయం. అయితే ఇరాన్ హార్ముజ్‌ను పూర్తిగా ఓపెన్ చేసేందుకు అంగీకరించకపోవడంతో గడువు పూర్తయ్యాక ట్రంప్ ఎలా స్పందిస్తారనేది చర్చనీయాంశమైంది.

News March 22, 2026

మహిళలకే క’న్నీటి’ కష్టాలు

image

నీటి కొరతతో ఎక్కువగా మహిళలు, బాలికలే ఇబ్బంది పడుతున్నట్లు యూఎన్ రిపోర్ట్ పేర్కొనడం చర్చనీయాంశమైంది. గ్లోబల్‌గా మహిళలు/బాలికలు నీటి సేకరణకే రోజుకు 25కోట్ల గంటలు వెచ్చిస్తున్నారు. నీరు సరఫరా లేని 70%కుపైగా గ్రామాల్లో నీటి బాధ్యత మహిళలదే. దీంతో వారి విద్యకు, ఆదాయానికి, ఆరోగ్యానికి, భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. ఇప్పటికీ 210 కోట్లకుపైగా ప్రజలకు సురక్షిత నీరు అందడం లేదు. >నేడు ప్రపంచ నీటి దినోత్సవం.

News March 22, 2026

పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపకండి: CM

image

TG: పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపాలనే మోజు నుంచి తల్లిదండ్రులు బయటకు రావాలని CM రేవంత్ సూచించారు. ‘వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రారంభిస్తున్నాం. ఇవి నర్సరీ నుంచి ప్రారంభం అవుతాయి. పాలు, బ్రేక్‌ఫాస్ట్ కూడా అందిస్తాం. ప్రైవేట్ కంటే గవర్నమెంట్ టీచర్లే ప్రతిభావంతులు. అన్ని ప్రభుత్వ స్కూళ్లను ప్రక్షాళన చేస్తాం. అందుకే విద్యాశాఖ నా దగ్గర పెట్టుకున్నా’ అని సిద్దిపేటలో తెలిపారు.