News August 1, 2024

బంటుమిల్లి: మానసిక వికలాంగురాలిపై అత్యాచారం

image

బంటుమిల్లి రాజీవ్ గాంధీ మార్కెట్ ఏరియాలో నివసిస్తున్న నరసమ్మ అనే మానసిక వికలాంగురాలిపై వెంకటేశ్వరరావు(50) అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారం చేయడంతో తీవ్ర రక్తస్రావం అవడంతో మహిళను నిగ్గదీసిన బంధువులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై వాసు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Similar News

News March 11, 2026

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి మృతి

image

కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు బుధవారం హైదరాబాదులో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన ఆయన 1984,1989,1998లో మచిలీపట్నం నుంచి, 2004, 2009లో ఏలూరు నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2013లో కేంద్ర జౌళి శాఖ మంత్రిగా సేవలందించారు. ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కావూరి మరణంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

News March 10, 2026

కృష్ణా: ‘పుర’లో ప్రత్యేక పాలన

image

స్థానిక సంస్థలైన నగర పాలక సంస్థ, పురపాలక సంఘం, నగర పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 17తో ముగియనుంది. దీంతో ప్రత్యేక అధికారుల పాలనకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎన్నికలు జరిగే వరకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 18 నుంచి ప్రత్యేక అధికారులు అధికారం చేపట్టనున్నారు. మచిలీపట్నం కార్పొరేషన్‌కు కలెక్టర్, పెడన మున్సిపాల్టీకి RDO, పెడనకు MUDA VC ప్రత్యేక అధికారులుగా వ్యవహరించనున్నారు.

News March 10, 2026

చల్లపల్లిలో బాలిక ఆత్మహత్య

image

చల్లపల్లి(M) నారాయణరావునగర్‌లో విషాద ఘటన సోమవారం చోటుచేసుకుంది. 10 ఏళ్ల బాలిక కడుపునొప్పితో స్కూలుకు వెళ్లకపోవడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురై ఉరేసుకుంది. గమనించిన తల్లి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై చల్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.