News August 1, 2024

గర్భంతో క్రీడల్లో పాల్గొనడం కొత్తేమీ కాదు!

image

ఏడు నెలల గర్భంతో ఒలింపిక్స్‌‌లో పాల్గొన్న ఈజిప్టు ఫెన్సర్ నడా హఫీజ్‌ను నెటిజన్లు అభినందిస్తున్నారు. ఇలా గర్భంతో ఉన్నవారు క్రీడల్లో పాల్గొనడం కొత్తేమీ కాదు. 2017లో సెరెనా విలియమ్స్ గర్భిణిగా ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచారు. 2014లో అల్సియా మోంటానో(USA) గర్భిణిగా ఉండి 800 మీటర్ల రేస్‌లో పాల్గొన్నారు. అయితే పోడియంలో ఇద్దరికి బదులు ఈసారి ముగ్గురం పాల్గొన్నామని నడా హఫీజ్‌ చేసిన ఇన్‌స్టా పోస్ట్ వైరలవుతోంది.

Similar News

News March 28, 2026

ఏడాది పొడవునా కాపునిచ్చే మామిడి!

image

సాధారణంగా మామిడి వేసవిలోనే దొరుకుతుంది. కానీ రాజస్థాన్‌కు చెందిన రైతు కిషన్ సుమన్ పదేళ్లు శ్రమించి ‘సదాబహార్’ అనే మామిడి రకాన్ని అభివృద్ధి చేశారు. ఇది ఏడాదికి మూడుసార్లు కాపునిస్తూ తియ్యగా, తక్కువ పీచుతో ఉంటుంది. రాష్ట్రపతి భవన్ తోటలోనూ ఇది చోటు సంపాదించుకుంది. మామిడి ప్రియులకు ఏడాది పొడవునా పండ్లను అందించే దిశగా ఇది ఒక విప్లవాత్మక మార్పు. ఈయన 7 రంగుల గులాబీ మొక్కనూ అభివృద్ధి చేశారు.

News March 28, 2026

SRHకు యంగెస్ట్ ఇండియన్ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్!

image

ఇవాళ RCBతో జరిగే మ్యాచ్‌లో కెప్టెన్సీ చేయడం ద్వారా SRH ప్లేయర్ ఇషాన్ కిషన్ అరుదైన ఘనత సాధించనున్నారు. సన్ రైజర్స్‌కు నాయకత్వం వహించనున్న యంగెస్ట్(27Y 253D) ఇండియన్ కెప్టెన్‌గా నిలవనున్నారు. గతంలో శిఖర్ ధవన్, మనీశ్ పాండే, భువనేశ్వర్ కాస్త లేటు వయసులో సారథ్యం చేపట్టారు. ఓవరాల్‌గా ఈ జాబితాలో విలియమ్సన్(27Y 244D) టాప్‌లో ఉన్నారు. కేన్ మామ 2018లో తొలిసారి SRHను లీడ్ చేసిన విషయం తెలిసిందే.

News March 28, 2026

రోజూ పండ్లు తింటే అంతా ఆరోగ్యమే: వైద్యులు

image

రోజుకొక యాపిల్ తింటే ఆరోగ్యంగా ఉంటారని చెబుతుంటారు. అయితే రోజుకు 2-3 రకాల పండ్లు తినడం మన ఆరోగ్యానికి అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ‘పండ్లలోని పీచు పదార్థం కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. పండ్లలోని సహజమైన చక్కెర.. మధుమేహం రాకుండా అడ్డుకుంటుంది. పండ్లు తినకపోతే గుండె జబ్బులు, ఇన్‌ఫ్లమేషన్ వంటి దీర్ఘకాలిక సమస్యలు తప్పవు. అందుకే పండ్లు తినాలి’ అని వివరించారు.