News August 1, 2024

వరంగల్ మార్కెట్‌లో మిర్చి ధరలు ఇలా..

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గురువారం మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ మిర్చి నిన్న క్వింటాకు రూ.18,200 పలకగా.. నేడు రూ.18,500 పలికింది. అలాగే 341 రకం మిర్చి నిన్నటి లాగే నేడు రూ.15 వేలు పలికింది. మరోవైపు వండర్ హాట్(WH) మిర్చి ధర తగ్గింది. నిన్న రూ.14 వేల ధర వచ్చిన మిర్చి నేడు రూ.13,500కి పడిపోయిందని వ్యాపారులు తెలిపారు.

Similar News

News March 16, 2026

స్త్రీనిధి రుణాలు పక్కదారి.. రూ.1.50 కోట్లు గోల్‌మాల్‌

image

వరంగల్‌ గ్రేటర్‌ కార్పొరేషన్‌ పరిధిలో స్త్రీనిధి రుణాలు దారి తప్పాయి. మహిళా సంఘాల సభ్యుల నుంచి కిస్తీలు వసూలు చేసిన 50 మంది రిసోర్స్‌ పర్సన్లు (ఆర్‌పీలు), ఆ సొమ్మును బ్యాంకులో జమ చేయకుండా సుమారు రూ.1.50 కోట్లు సొంతానికి వాడుకున్నారు. అధికారుల నోటీసులతో అసలు విషయం బయటపడటంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. బాధ్యులైన ఆర్‌పీలకు అధికారులు మెమోలు జారీ చేశారు.

News March 16, 2026

WGL: సింహపురి ఎక్స్‌ప్రెస్‌ నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

వరంగల్‌-కాజీపేట స్టేషన్ల మధ్య హంటర్ రోడ్ శాయంపేట రైల్వే గేట్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున సింహపురి ఎక్స్‌ప్రెస్‌ నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వద్ద ఈనెల 15నాటి ఆర్టీసీ ఎక్స్‌ రోడ్స్-సికింద్రాబాద్ బస్సు టికెట్, సప్తగిరి థియేటర్ సినిమా టికెట్ లభించాయి. ఇతర గుర్తింపు ఆధారాలు లేకపోవడంతో మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసినట్లు జీఆర్‌పీ పోలీసులు తెలిపారు.

News March 15, 2026

జనగణన నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్

image

జనగణన-2027 మార్గదర్శకాల ప్రకారం ఇండ్ల జాబితా, గణన ప్రక్రియను జిల్లాలో నిర్దేశిత సమయంలోనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద అధికారులను ఆదేశించారు. మూడు రోజుల పాటు జిల్లా, మండల, మున్సిపల్ స్థాయి అధికారులకు నిర్వహించిన శిక్షణ ఆదివారం కలెక్టరేట్‌లో ముగిసింది. హైదరాబాద్ డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ జాయింట్ డైరెక్టర్ డి. సుబ్బరాజు, గణాంకాధికారి సతీష్ పాల్గొని శిక్షణ ఇచ్చారు.