News August 1, 2024
రూ.4 వేలు ఇచ్చే రాష్ట్రం మనదే: నారాయణ

నెల్లూరు నగరంలోని 48వ డివిజన్ పొర్లుకట్ట ప్రాంతంలో పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇంటింటికీ తిరిగి నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెలకు రూ.4 వేల పింఛన్ అందజేసే ఏకైక రాష్ట్రం ఏపీ అని కొనియాడారు. ఆయన వెంట నగర కమిషనర్ సూర్యతేజ, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Similar News
News September 18, 2025
నెల్లూరు: చేపల పెంపకానికి కోళ్ల వ్యర్థాలు..!

నెల్లూరు జిల్లాలో కొందరు నిషేధిత క్యాట్ ఫిష్ పెంచుతున్నారు. వీటికి కోళ్ల వ్యర్థాలను మేతగా వాడుతూ ప్రజారోగ్యం, పర్యావరణానికి ముప్పు తెస్తున్నారు. జిల్లాలోని 16 మండలాల పరిధిలో 21,629 చెరువుల్లో అనుమతులతో చేపలు పెంచుతున్నారు. మరో 5వేల ఎకరాల్లో అక్రమంగా ఆక్వా సాగు ఉన్నట్లు అంచనా. అల్లూరు, బుచ్చి, సంగం, కోవూరు, ముత్తుకూరు, నెల్లూరు రూరల్ పరిధిలో వ్యర్థాల వాడకం ఎక్కువగా ఉంటోంది.
News September 18, 2025
నెల్లూరు: రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆగేదెప్పుడు?

నెల్లూరులో రేషన్ బియ్యం మాఫియా ఆగడం లేదు. ప్రభుత్వ హెచ్చరికలు, కేసులు ఉన్నా అక్రమార్కులు కోట్ల విలువైన బియ్యం నల్లబజారుకు మళ్లిస్తున్నారు. నెల్లూరు, ఆత్మకూరు ప్రాంతాలకు చెందిన వ్యాపారులు మిల్లుల్లోనే బియ్యం రీసైకిల్ చేసి సీఎంఆర్ కింద ప్రభుత్వానికే తిరిగి పంపుతున్నారు. జిల్లాలో నెలకు సరఫరా చేసే 11 వేల టన్నుల్లో సుమారు 8 వేల టన్నులు పక్కదారి పడుతున్నాయని సమాచారం.
News September 18, 2025
ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు ఇస్తాం: మంత్రి ఆనం

సంగం మండలం పెరమన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. రూ.5 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వడానికి సీఎం చంద్రబాబు అంగీకారం తెలిపారన్నారు. తక్షణం ఆర్థిక సహాయం ప్రకటించిన సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.