News August 1, 2024
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, కొత్తగూడెం, ఖమ్మంలో వాన పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. వరంగల్, మెదక్, హన్మకొండ, కామారెడ్డి, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లోనూ ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది.
Similar News
News April 5, 2026
ALERT: 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

AP: రాష్ట్రంలో 2 రోజులు భిన్న వాతావరణ పరిస్థితులుంటాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో. జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవొచ్చని చెప్పింది. ఇవాళ 66 మండలాల్లో 40డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, కొన్నిజిల్లాల్లో ఎండలు తీవ్రంగా ఉంటాయని తెలిపింది.
News April 5, 2026
RARE: ఒకే పోలికతో నలుగురు పిల్లల జననం

రష్యాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఒకే పోలికతో ఉన్న నలుగురు పిల్లల(quadruplets)కు మహిళ జన్మనిచ్చింది. వారంతా అమ్మాయిలే కావడం గమనార్హం. 1.55 కోట్ల మందిలో ఒకరికి ఇలా జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరోవైపు రష్యాలో ఇలా జరగడం తొలిసారని తెలుస్తోంది.
News April 5, 2026
సౌర కుటుంబం గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

*సోలార్ సిస్టమ్‌లో 99.86% సూర్యుడే ఉంటాడు
*శుక్రుడిని మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అని పిలుస్తారు
*భూమికి ఉన్న ఏకైక నేచురల్ శాటిలైట్ చంద్రుడు
*సూర్యుడిని ఫాదర్ ఆఫ్ సోలార్ సిస్టమ్ అంటారు
*మార్స్‌పై ఉన్న ఐరన్ ఆక్సైడ్ వల్ల దాన్ని రెడ్ ప్లానెట్ అని పిలుస్తారు
*1,300 భూములను కలిపితే ఒక గురుడు (జూపిటర్)
*జీవం ఉండే ఏకైక గ్రహం భూమి


