News August 1, 2024
పెద్దపల్లి: అద్దె, ఆస్తిపన్నులు వసూలు చేయాలి: కలెక్టర్

పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలో రావాల్సిన అద్దెలను, ఆస్తి పన్నులను వసూలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి మున్సిపాలిటీలపై అదనపు కలెక్టర్ అరుణ శ్రీ, సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆదాయం పెంపుపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఎల్లమ్మ చెరువు మినీ ట్యాంక్ బండ్‌ను పరిశుభ్రంగా ఉంచాలని, కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేపట్టాలని చెప్పారు.
Similar News
News March 27, 2026
KNR: భారీ బ్యాంకు కుంభకోణం.. రూ.100 కోట్ల గోల్‌మాల్!

కరీంనగర్ నగరంలోని ఓ ప్రముఖ బ్యాంకులో భారీ ఆర్థిక కుంభకోణం వెలుగుచూసింది. సుమారు రూ.100 కోట్లకు పైగా నిధులు నకిలీ ఖాతాలకు మళ్లినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. బ్యాంకు సిబ్బంది సహకారంతోనే ఈ అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ నిధులు హవాలా మార్గంలో తరలినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 27, 2026
పెట్రో, డీజిల్ ధరల తగ్గింపు చారిత్రకం: బండి సంజయ్

పెట్రోలు, డీజిల్ ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం చారిత్రకమని కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ లో కొనియాడారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రధాని మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. కేంద్రం బాటలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణమే వ్యాట్ (VAT) తగ్గించాలని డిమాండ్ చేశారు. తద్వారా నిత్యావసరాల ధరలు తగ్గి సామాన్యులకు మేలు జరుగుతుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
News March 27, 2026
కరీంనగర్: రిజిస్ట్రేషన్ కార్యాలయాల పనివేళల పొడిగింపు

కరీంనగర్ జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల పనివేళలను ప్రభుత్వం పొడిగించింది. ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఈ నెల 28 నుంచి 31 వరకు ప్రతిరోజూ ఉదయం 9:30 నుంచి రాత్రి 8:30 గంటల వరకు స్లాట్లు అందుబాటులో ఉంటాయని రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. పెరిగిన సమయానికి అనుగుణంగా అధికారులు, సిబ్బంది విధుల్లో ఉండి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.


