News August 1, 2024
రెస్టారెంట్‌లో ఒకలా.. జొమాటోలో మరోలా!

ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ ‘జొమాటో’పై నెట్టింట విమర్శలొస్తున్నాయి. రెస్టారెంట్‌లో ఉన్న ధరలకు ఆన్‌లైన్‌లో చూపించే వాటికి చాలా వ్యత్యాసం ఉందని ఓ నెటిజన్ చేసిన ట్వీట్ వైరలవుతోంది. ముంబైలోని ఓ హోటల్‌లో ఉప్మా రూ.40 ఉంటే జొమాటోలో రూ.120 ఉందని సాక్ష్యాలతో పోస్ట్ చేశారు. అయితే, ప్లాట్‌ఫామ్‌లో ఉండే ధరలను రెస్టారెంట్స్ నిర్ణయిస్తాయని జొమాటో రిప్లై ఇచ్చింది. మీరూ దీనిని గుర్తించారా? కామెంట్ చేయండి.
Similar News
News March 11, 2026
వార్ ఎఫెక్ట్.. హోటళ్లు, హాస్టళ్లలో ఇదీ పరిస్థితి!

TG: హైదరాబాద్‌లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరతతో హోటళ్లు, హాస్టళ్లు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. సరఫరా తగ్గడంతో ఇప్పటికే పలు హోటళ్లు మెనూను కుదించగా, కొన్ని చోట్ల ధరలు పెరిగాయి. అటు హాస్టళ్లలో దోశ, పూరీ వంటి వంటకాలను నిలిపివేసి, భోజనం మాత్రమే అందిస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే భోజనం పెట్టలేమని, వసతి మాత్రమే కల్పిస్తామని యజమానులు హెచ్చరిస్తుండటంతో విద్యార్థులు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
News March 11, 2026
SBI ఫెలోషిప్: ₹1.1 లక్షల గ్రాంట్.. నెలకు ₹21,000

SBI ‘యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్’ కోసం అప్లికేషన్లను ఆహ్వానిస్తోంది. రూరల్ కమ్యూనిటీస్, NGOలతో కలిసి 13 నెలలు పనిచేయాల్సి ఉంటుంది. డిగ్రీ కంప్లీట్ చేసి 21-32 ఏళ్ల వయసున్న వాళ్లు అర్హులు. నెలకు ₹21 వేల అలవెన్సులతో పాటు ఫెలోషిప్ పూర్తైన తర్వాత ₹1,10,000 గ్రాంట్ అందజేస్తారు. ఆన్‌లైన్ అసెస్‌మెంట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్ట్ చేస్తారు. ఏప్రిల్ 30 వరకు <
News March 11, 2026
సౌదీకి సైనిక సాయం చేస్తాం: పాక్

ఇరాన్ దాడుల నేపథ్యంలో సౌదీకి మద్దతుగా ఉంటామని పాకిస్థాన్ ప్రకటించింది. గతేడాది కుదుర్చుకొన్న రక్షణ ఒప్పందం ప్రకారం రియాద్‌కు ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఏ క్షణమైనా అవసరమైన సాయం అందిస్తామని PM షెహబాజ్ షరీఫ్ ప్రతినిధి ముషారఫ్ జైదీ స్పష్టం చేశారు. యుద్ధం ముగిసేలా దౌత్యపరంగా ప్రయత్నం చేస్తామన్నారు. మరోవైపు పెరుగుతున్న చమురు ధరల దృష్ట్యా పాక్‌కు ఇంధన సరఫరా చేసేందుకు సౌదీ అంగీకరించిందని వెల్లడించారు.


