News August 1, 2024

ఏయూ పరిధిలో సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో ఎంకామ్ నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను, బిబిఏ-ఎంబీఏ ఆరో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. పరీక్ష ఫలితాలను ఏయూ వెబ్సైట్లో పొందుపరిచారు. ఎం.కామ్ విద్యార్థులు ఆగస్టు 14లోగా రీవాల్యుయేషన్ కు దరఖాస్తు చేసుకోవాలి. బిబిఏ-ఎంబీఏ విద్యార్థులు ఆగస్టు 15లోగా రీవాల్యుయేషన్ కు దరఖాస్తు చేసుకోవాలని పరీక్షల విభాగం అధికారులు సూచించారు.

Similar News

News March 6, 2026

విశాఖ: 5 నిమిషాల ఆలస్యంతో అవకాశం కోల్పోయారు

image

రైల్వే టెక్నీషియన్ గ్రేడ్-3 పరీక్షకు ఐదు నిమిషాలు ఆలస్యం కావడంతో సుమారు పది మంది అభ్యర్థులు అవకాశం కోల్పోయారు. పెందుర్తి చినముషిడివాడ డిజిటల్ అయాన్ సెంటర్‌లో శుక్రవారం ఉదయం మొదటి షిఫ్ట్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఉదయం 7:30 నుంచి 8:30 వరకు రిపోర్టింగ్ సమయం కాగా, అభ్యర్థులు 8:35 గంటలకు రావడంతో వారిని అనుమతించలేదు. ఈ పరీక్షకి ఒడిశా నుంచి వచ్చామని, అవకాశం కోల్పోయామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

News March 6, 2026

విశాఖ మురికివాడలకు మహార్దశ

image

విశాఖలోని మురికివాడల అభివృద్ధికి చర్యలు మొదలయ్యాయి. జీవీఎంసీ పరిధిలో గుర్తించిన 66 మురికివాడల్లో వెలంపేట, ఇందిరానగర్ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ప్రాజెక్టు ప్రారంభించనున్నారు. ముంబయి తరహాలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించి అందించనున్నారు. పీపీపీ విధానంలో అమలు చేయనున్న ఈ ప్రణాళికలో వెలంపేటలో 177 కుటుంబాల కోసం రూ.23.17 కోట్లు, ఇందిరానగర్‌లో 110 కుటుంబాల కోసం రూ.16.18 కోట్లు ఖర్చు చేయనున్నారు.

News March 6, 2026

విశాఖ: చారిత్రక వారసత్వం.. నేడు కేవలం ల్యాండ్‌మార్క్..!

image

విశాఖ టౌన్ కొత్తరోడ్డు ప్రాంతంలో వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన CBM (కెనడియన్ బాప్టిస్ట్ మిషన్) పాఠశాల నేడు గత వైభవానికి గుర్తుగా మిగిలిపోయింది. ఒకప్పుడు వేలాది మందికి అక్షరజ్ఞానం అందించిన ఈ సంస్థ, ప్రభుత్వ ఎయిడెడ్ విధానాల్లో మార్పులు, నిర్వహణ సమస్యల వల్ల ఇటీవల కాలంలో తన విద్యా కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ‘జన్మభూమి’ స్టార్ట్ చేసింది కూడా ఈ స్కూల్లోనే.