News August 1, 2024
ఎన్టీఆర్‌తో సినిమా వార్తలు అవాస్తవం: శౌర్యువ్

‘హాయ్ నాన్న’ సినిమా డైరెక్టర్ శౌర్యువ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమా తీస్తున్నారనే వార్త ఇండస్ట్రీలో తెగ వైరలైంది. ఈ రూమర్లలో వాస్తవం లేదని శౌర్యువ్ క్లారిటీ ఇచ్చారు. ‘ఇది నిజం కాదు. ఈ వదంతులు ఎలా మొదలయ్యాయో నాకు తెలియదు. దురదృష్టవశాత్తు ఇది తప్పుడు సమాచారం. నిజం కావాలనే నేను కోరుకుంటున్నా. ఒకరోజు అది నిజమవుతుందని ఆశిద్దాం’ అని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటికైతే ఎన్టీఆర్‌తో మూవీ ప్లాన్ లేదన్నారు.
Similar News
News January 12, 2026
ప్రభుత్వ ఉద్యోగులకు CM సంక్రాంతి కానుక

TG: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఒక డీఏ చెల్లిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఇప్పుడున్న డీఏ మరో 3.64 శాతం పెరుగుతుంది. 2023 జులై నుంచి పెంచిన DA అమల్లోకి వస్తుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ డీఏ పెంపుతో ప్రభుత్వంపై రూ.227 కోట్ల భారం పడనుంది. అటు ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
News January 12, 2026
BANలో హిందూ సింగర్ మృతి.. జైలు అధికారులపై ఆరోపణలు

బంగ్లాదేశ్‌లో హిందూ సింగర్, అవామీ లీగ్ నేత ప్రోలోయ్ చాకీ(60) కన్నుమూశారు. 2024లో జరిగిన ఓ పేలుడు కేసులో ఆయన్ను గత నెల 16న పోలీసులు అరెస్ట్ చేశారు. జైలు కస్టడీలో ఉన్న ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఇప్పటికే డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలు ఉండటంతో ఆరోగ్యం క్షీణించింది. ఆస్పత్రికి తరలించగా నిన్న రాత్రి చనిపోయారు. అయితే చికిత్స అందించడంలో జైలు అధికారులు ఆలస్యం చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.
News January 12, 2026
మినుము పంట పూత, పిందె దశల్లో పల్లాకు తెగులు నివారణ ఎలా?

మినుములో పల్లాకు తెగులు లక్షణాలు గుర్తించిన వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలి. ముందుగా ఈ తెగులును వ్యాప్తి చేసే తెల్లదోమ నివారణకు ఎకరాకు డైమిథోయేట్ 400ml లేదా థయోమిథాక్సాం 40గ్రా. లేదా అసిటామిప్రిడ్ 40 గ్రా. లేదా ఎసిఫేట్ 200 గ్రాములను 200 లీటర్ల నీటికి కలిపి మొక్కలు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. దీంతో పాటు ఎకరానికి 20 చొప్పున పసుపు రంగు జిగురు అట్టలను అమర్చి ఈ తెగులును నియంత్రించవచ్చు.


