News August 1, 2024

సీఎం, డిప్యూటీ సీఎం పోటీ పడి మహిళల్ని అవమానించారు: సబిత

image

TG: అసెంబ్లీలో CM రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి పోటీ పడి మహిళల్ని అవమానించారని BRS ఎమ్మెల్యే సబిత అన్నారు. ‘రేవంత్ మాటలు సీఎం హోదాను తగ్గిస్తున్నాయి. నిన్న చేసిన <<13745152>>వ్యాఖ్యలపై<<>> క్షమాపణలు చెప్పకుండా ఇవాళ మళ్లీ అలాంటి మాటలే మాట్లాడారు. సభలో లేని కవిత పేరు ప్రస్తావించడం సంస్కారమా? నా వల్ల CLP పదవి పోయిందన్న భట్టి విక్రమార్క.. ఇప్పుడు SC నేతకు CM పదవి ఇవ్వాలని ఎందుకు అడగలేదు?’ అని ప్రశ్నించారు.

Similar News

News February 2, 2025

బాలుడి ఆవిష్కరణకు సీఎం రేవంత్ ప్రశంస

image

TG: హైబ్రిడ్ సైకిల్‌ను రూపొందించిన 14 ఏళ్ల చిన్నారి గగన్ చంద్రను సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. ఈ చిన్నారి ఆవిష్కరణ తన దృష్టిని ఆకర్షించిందని ట్వీట్ చేశారు. అతనికి అభినందనలు తెలిపారు. మరిన్ని పరిశోధనలు, ఆవిష్కరణలు చేసేందుకు గగన్‌కు మద్దతుగా నిలుస్తామని పేర్కొన్నారు. కాగా గగన్ సోలార్, బ్యాటరీ, పెట్రోల్‌తో నడిచే సైకిల్‌ను రూపొందించాడు.

News February 2, 2025

BREAKING: చరిత్ర సృష్టించిన భారత్

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న 5వ T20లో భారత్ చరిత్ర సృష్టించింది. T20Iలో పవర్‌ప్లేలో అత్యధిక స్కోరు చేసింది. అభిషేక్ శర్మ(94*), తిలక్ వర్మ(24) విధ్వంసంతో 6 ఓవర్లలో భారత్ 95/1 రన్స్ చేసింది. ఇప్పటివరకు 2021లో స్కాట్లాండ్‌పై చేసిన 82/2 పవర్‌ప్లేలో భారత్‌కు అత్యధిక స్కోరు కాగా, ఆ రికార్డును తాజాగా బ్రేక్ చేసింది. ప్రస్తుతం స్కోరు 9 ఓవర్లలో 136-2గా ఉంది.

News February 2, 2025

వాంఖడే స్టేడియంలో రిషి సునాక్

image

భారత్ పర్యటనలో ఉన్న బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ వాంఖడే స్టేడియంలో సందడి చేశారు. భారత్, ఇంగ్లండ్ జట్ల కెప్టెన్లు సూర్య, బట్లర్‌తో ఆయన సరదాగా సంభాషించారు. అంతకుముందు పార్సీ జింఖానా గ్రౌండ్‌లో చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడారు. టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడకుండా తన ముంబై పర్యటన ముగియదని Xలో రాసుకొచ్చారు.