News August 1, 2024

ప్రభుత్వం కీలక నిర్ణయం

image

తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. క్రికెటర్ సిరాజ్, బాక్సర్ నిఖత్ జరీన్‌కు గ్రూప్-1 క్యాడర్‌లో డీఎస్పీ ఉద్యోగాలు ఇవ్వనుంది. ఇటీవల టీ20 వరల్డ్ కప్‌ సాధించిన జట్టులో సిరాజ్ సభ్యుడు కాగా రాష్ట్రానికి చెందిన నిఖత్ గతంలో రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచారు.

Similar News

News March 24, 2026

ఇరాన్ గ్యాస్ స్టేషన్‌పై దాడి.. ట్రంప్ ప్రకటన ఉత్తదేనా?

image

ఇరాన్‌లోని విద్యుత్ ప్లాంట్లపై 5 రోజుల పాటు దాడులు చేయబోమని ట్రంప్ నిన్న ప్రకటించినా వాస్తవ పరిస్థితి వేరేలా ఉంది. ట్రంప్ ప్రకటన తర్వాత ఇస్‌ఫహాన్ ప్రావిన్స్‌లోని నేచురల్ గ్యాస్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, గ్యాస్ స్టేషన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు చేశాయి. ప్రాణనష్టం లేకపోయినా పలు ఆస్తులు దెబ్బతిన్నట్లు సమాచారం. ఈ టెన్షన్లతో బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 102-103 డాలర్లకు పెరిగింది.

News March 24, 2026

క్రైస్తవంలోకి మారిన వారు ఎస్సీ హక్కులు పొందలేరు: SC

image

SCల మతమార్పిడి అనంతరం హక్కులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. క్రైస్తవంలోకి మారిన వారు SC హక్కులు పొందలేరని స్పష్టం చేసింది. హిందువులు, బౌద్ధులు, సిక్కులు మాత్రమే SC హక్కులు పొందుతారని పేర్కొంది. ‘కుల వ్యవస్థ క్రైస్తవ మతంలో లేదు’ అని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో AP హైకోర్టు తీర్పును సమర్థించింది.

News March 24, 2026

పెట్రోల్‌లో ఇథనాల్ మిక్స్ 30%కు పెంచాలి: AIDA

image

పెట్రోల్‌లో ఇథనాల్ కలిపే మోతాదు 20% నుంచి 30%కు పెంచాలని ఆల్ ఇండియా డిస్టిలరీస్ అసోసియేషన్ (AIDA) కేంద్రాన్ని కోరింది. డీజిల్‌లోనూ ఇథనాల్ బ్లెండ్ చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. అలాగే అధిక మోతాదు ఇథనాల్‌తోనూ సమర్థంగా పనిచేయగలిగే ఫ్లెక్స్ ఫ్యూయెల్ వెహికల్స్‌ను త్వరగా అందుబాటులోకి తేవాలని కోరింది. దీని వల్ల చమురుపై ఆధారపడటం తగ్గుతుందని పేర్కొంది.