News August 1, 2024
బంగారం కొంటారా: US ఫెడ్ పంపిన సిగ్నల్స్ ఇవే

గోల్డ్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్! సెప్టెంబర్లో వడ్డీరేట్ల తగ్గింపుపై US ఫెడ్ సిగ్నల్స్ ఇచ్చింది. అప్పుడు ధర ఇంకా పెరగొచ్చు. ఎందుకంటే బంగారం, డాలర్ మధ్య విలోమ సంబంధం ఉంటుంది. ఒకటి పెరిగితే మరోటి తగ్గుతుంది. వడ్డీరేట్ల కోతతో పుత్తడి మంచి పెట్టుబడి సాధనం అవుతుంది. యుద్ధాలు, జియో పాలిటిక్స్ వల్ల భారత్, చైనా టన్నుల కొద్దీ గోల్డ్ కొంటున్నాయి. కస్టమ్స్ సుంకం తగ్గడంతో యెల్లో మెటల్ డిమాండ్ పెరగడం ఖాయం.
Similar News
News January 26, 2026
రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్, సీఎం చంద్రబాబు

AP: అమరావతిలోని రాయపూడిలో జరుగుతున్న రిపబ్లిక్ వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అంతకుముందు ఆయనకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. పతాకావిష్కరణ తర్వాత పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. కాగా తొలిసారిగా అమరావతిలో గణతంత్ర వేడుకలు నిర్వహిస్తున్నారు. అమరావతి రైతులు, విద్యార్థులకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు.
News January 26, 2026
ఇండోర్‌లో కలుషిత నీరు.. 28కి చేరిన మరణాలు

MPలోని ఇండోర్‌లో కలుషిత నీరు తాగి మరణించిన వారి సంఖ్య 28కి చేరింది. భగీరథ్‌పురలో 10 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మోవ్‌లో 30 మంది అస్వస్థతకు గురయ్యారు. అటు ప్రభుత్వం 21 మంది మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం చెల్లించింది. కాగా బాధితులకు అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు ఇండోర్ కలెక్టర్ శివమ్ వర్మ తెలిపారు.
News January 26, 2026
312 పోస్టులు.. అప్లైకి మూడు రోజులే ఛాన్స్

RRB ఐసోలేటెడ్ కేటగిరీలో 312 పోస్టులకు అప్లై చేయడానికి 3 రోజులే ( JAN 29) సమయం ఉంది. పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ, LLB, MBA, డిప్లొమా, PG(హిందీ, ఇంగ్లిష్, సైకాలజీ) అర్హతతో పాటు పని అనుభవం గలవారు అర్హులు. CBT(1, 2), స్కిల్ టెస్ట్, DV, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.19,900-రూ.44,900 వరకు చెల్లిస్తారు. సైట్: www.rrbcdg.gov.in/ * మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.


