News August 1, 2024
గనుల శాఖ మాజీ ఎండీ సస్పెండ్

AP: గనుల శాఖ మాజీ ఎండీ వెంకట్ రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇసుక తవ్వకాలు, గనుల్లో అక్రమాల ఆరోపణలపై విచారించి చర్యలు తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారు.
Similar News
News March 19, 2026
తొలి విడతలోనే అందరికీ రైతు భరోసా?

రైతు భరోసా పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. విస్తీర్ణం ప్రాతిపదికన విడతల వారీగా కాకుండా ఈ నెల 22న ఒకే రోజు 70 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందించాలని చూస్తోంది. రైతుకు ఎంత భూమి ఉన్నా తొలి విడతలో మొదటి ఎకరాకు ₹6,000 నగదును అకౌంట్లలో జమ చేస్తారని సమాచారం. మిగిలిన భూమికి 2, 3 విడతల్లో సాయం అందనుంది. ఎకరం లోపు ఉన్న వారికి ఎలాగూ తొలిరోజే పడుతుంది.
News March 19, 2026
IIT బెనారస్‌లో ఉద్యోగాలు

ఐఐటీ బెనారస్ హిందూ యూనివర్సిటీ 5 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గల వారు మార్చి 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BTech/MTech/PhD, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నోడల్ ఆఫీసర్‌కు నెలకు రూ.లక్ష, రీసెర్చ్ ఇంజినీర్‌కు రూ.75K, డిజైన్ ఇంజినీర్‌కు రూ.55K, టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.45K చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.iitbhu.ac.in
News March 19, 2026
ఉగాది: ఏ చీర కట్టుకుంటే ఎలా ఉంటుంది?

పండుగ సమయంలో మంగళగిరి పట్టు చీర ధరిస్తే హుందాగా ఉంటుంది. ఇవి తక్కువ ధరల్లో ఫ్యాన్సీ రకాల్లో మార్కెట్లో లభిస్తాయి. యువతులకైనా, మధ్యవయస్కులకైనా ఇవి సూపర్‌గా ఉంటాయి. పైథానీ పట్టు చీర మెరుస్తూ మంచి లుక్ ఇస్తుంది. గద్వాల్ చీరలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. పట్టులో కాకుండా ఫ్యాన్సీలో ట్రెండీగా కనిపించాలనుకుంటే ప్రింట్ చీరలు తీసుకోవచ్చు. ఏవి కట్టుకున్నా దాన్ని హుందాగా క్యారీ చేస్తే అందరి దృష్టీ మీ పైనే..


